గజల్ శ్రీనివాస్‌ కేసు: చావాలనుకొన్నా, కానీ, రికార్డు చేశా, భార్యకు కూడ చెప్పా: బాధితురాలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  గజల్ శ్రీనివాస్ గదిలో నగ్నంగా : అలాంటివాడు కాదంటూ మరో కోణం ?

  హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగికంగా తనను లోబర్చుకొనేందుకు పెట్టిన హింసలను తట్టుకోలేక ఒకానొక సందర్భంలో చనిపోవాలని భావించానని బాధితురాలు చెప్పారు. అయితే సమాజంలో ప్రముఖుడిగా ముద్రపడిన గజల్ శ్రీనివాస్ బండారాన్ని సాక్ష్యాలతో బట్టబయలు చేసేందుకు ప్రాణాలకు తెగించినట్టు ఆమె వివరించారు.

  గజల్ శ్రీనివాస్ కేసు: 'ఆమె వెనుక ఎవరైనా ఉన్నారేమో, మసాజ్ టైంలో అక్కడే ఉన్నా'

  ఆలయవాణి వెబ్ రేడియోలో రేడియో జాకీగా పనిచేస్తున్న యువతి తనను లైంగికంగా వేధిస్తున్నారని గజల్ శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా గజల్ శ్రీనివాస్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

  లైంగిక వేధింపుల వివాదం: మసాజ్ చేయించుకొన్నా, కానీ, నా బిడ్డగా భావించా: గజల్ శ్రీనివాస్

  అయితే గజల్ శ్రీనివాస్‌కు మరో మహిళ కూడ సహకరించిందని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరో మహిళను ఈ కేసులో ఎ2 గా చేర్చారు. అయితే ఈ కేసులో ఎ2 గా ఉన్న నిందితురాలు తనకు ఏ పాపం తెలియదంటున్నారు.ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గజల్ శ్రీనివాస్ తనను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో బాధితురాలు వివరించారు.

  గజల్ శ్రీనివాసులు వేధింపులు భరించలేక చావాలనుకొన్నా

  గజల్ శ్రీనివాసులు వేధింపులు భరించలేక చావాలనుకొన్నా

  ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పెట్టిన బాధలు భరించలేక ఒకానొక దశలో చావాలని భావించానని బాధితురాలు చెప్పారు,. ఉద్యోగం మానేయడానికి ప్రయత్నం చేస్తే తనపై నిందలు మోపుతానని గజల్ శ్రీనివాస్ బెదిరించారని ఆమె చెప్పారు. రెండు మాసాలుగా తీవ్రమైన మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని బాధితురాలు కన్నీళ్ళపర్యంతమయ్యారు.తనలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ధైర్యం చేశానని చెప్పారు. సమాజంలో ప్రముఖ వ్యక్తిగా భావిస్తున్న గజల్ శ్రీనివాస్ బండారాన్ని బట్టబయలు చేసేందుకు ప్రాణాలకు తెగించినట్టు ఆమె చెప్పారు.

   దొరికితే చంపేస్తారని తెలుసు

  దొరికితే చంపేస్తారని తెలుసు

  నాలుగు మాసాల నుండి తనపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని బాధితురాలు చెప్పారు. అయితే ఈ విషయాలు ఎవరికీ చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదన్నారు. సమాజంలో ప్రముఖ వ్యక్తిగా పేరున్న వ్యక్తిని సాక్ష్యాలతో బట్టబయలు చేయాలని భావించానని చెప్పారు. తాను పనిచేసే కార్యాలయంలోనే గజల్ శ్రీనివాస్‌కు ఉన్న బెడ్‌రూమ్‌లోనే రహస్యంగా కెమెరాను ఏర్పాటు చేశానని ఆమె చెప్పారు. కెమెరాను ఎక్కడ పెడితే వీడియోలు సక్రమంగా రికార్డు అవుతాయో పరిశీలించినట్టు చెప్పారు.అయితే రహస్యంగా కెమెరాను ఏర్పాటు చేశానని ఆమె చెప్పారు. ఈ కెమెరా దొరికితే తనను చంపేస్తారని తెలుసునని ఆమె చెప్పారు.

   కెమెరా పెట్టే విషయాన్ని స్నేహితులకు చెప్పా

  కెమెరా పెట్టే విషయాన్ని స్నేహితులకు చెప్పా

  గజల్ శ్రీనివాస్ బెడ్‌రూమ్‌లో కెమెరా పెట్టే విషయాన్ని తన సన్నిహిత మిత్రులకు చెప్పానని ఆమె చెప్పారు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే గజల్ శ్రీనివాస్ తనను చంపుతారని తెలుసునని చెప్పారు.ఒకవేళ తనకేమైనా జరిగితే ఈ విషయం బయటకు రావాలనే ఉద్దేశ్యంతో కెమెరా పెట్టిన విషయాన్ని సన్నిహిత మిత్రులకు చెప్పానని ఆమె గుర్తు చేసుకొన్నారు.

   భోజనం చేస్తూ ఏడ్చేదాన్ని

  భోజనం చేస్తూ ఏడ్చేదాన్ని

  గజల్ శ్రీనివాస్ పెట్టే వేధింపులు భరించలేక మానసిక సంఘర్షణకు గురయ్యాయని బాధితురాలు చెప్పారు. భోజనం చేసేటప్పుడు కూడ ఏడ్చేదాణ్ణని ఆమె చెప్పారు. అదే సమయంలో తన కుటుంబసబ్యులు, కొందరు మిత్రులు తనలో వచ్చిన మార్పు విషయమై అడిగారని ఆమె గుర్తు చేసుకొన్నారు. కానీ, పని ఒత్తిడి కారణమని అబద్దం చెప్పి తప్పించుకొనేదాణ్ణని ఆమె గుర్తు చేసుకొన్నారు.

   గజల్ శ్రీనివాస్‌కు ఆమె సహకరించేది

  గజల్ శ్రీనివాస్‌కు ఆమె సహకరించేది

  గజల్ శ్రీనివాస్ ఆపీసులో పనిచేస్తున్న మరో మహిళ ఆయనకు సహకరించేదని బాధితురాలు చెప్పారు. ఆపీసులో తాము పనిచేస్తున్న సమయంలో రెండు మూడు గంటలపాటు బెడ్‌రూమ్‌లో గడియ పెట్టుకొని వారు గడిపేవారని బాధితురాలు చెప్పారు. గజల్ శ్రీనివాస్‌కు సహకరించాలని ఈ కేసులో ఎ2 నిందితురాలుగా ఉన్న మహిళ ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పారు. సాటి మహిళ అని చూడకుండానే తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చిందన్నారు.గజల్ శ్రీనివాస్‌ను గదిలోకి పంపి తనను తీసుకొస్తానని ఆమె చెప్పిన వీడియోలు కూడ రికార్డైన దృశ్యాలను ఆమె ప్రస్తావించారు.

   గజల్ శ్రీనివాస్ భార్యకు కూడ చెప్పా

  గజల్ శ్రీనివాస్ భార్యకు కూడ చెప్పా

  గజల్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు కూడ ఈ విషయాలను తాను చెప్పానని బాధితురాలు గుర్తు చేశారు. ఆపీసుకు వచ్చిన సమయంలో గజల్ శ్రీనివాస్ సతీమణికి ఈ విషయాన్ని చెప్పానన్నారు. మీ స్థానాన్ని ఈ కార్యాలయంలో పనిచేస్తున్న మరో మహిళ భర్తీ చేస్తోందని చెప్పారు.ఆధ్యాత్మికత ముసుగులో గజల్ శ్రీనివాస్ నీచానికి దిగజారాడని ఆమె చెప్పారు.

   తప్పు చేయలేదని కుటుంబసభ్యులకు చెప్పా

  తప్పు చేయలేదని కుటుంబసభ్యులకు చెప్పా

  పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత తన తల్లికి పోన్ చేసి విషయాన్ని చెప్పానని ఆమె చెప్పారు. తన తప్పు లేదని అన్ని విషయాలను చెప్పానని ఆమె గుర్తు చేశారు. అయితే తన తల్లి ధైర్యం చేశావని అభినందించారన్నారు.తన తప్పు లేదని కుటుంబసభ్యులకు క్లియర్ గా చెప్పానన్నారు.

   వీడియోలు చూసి ఏడ్చాను

  వీడియోలు చూసి ఏడ్చాను

  రహస్యంగా తీసిన వీడియోలో రికార్డైన దృశ్యాలు గంటలకొద్ది ఉన్నాయన్నారు. ఈ వీడియోలన్నింటిని పోలీసులకు సమర్పించానని ఆమె చెప్పారు. అయితే అదే సమయంలో ఒకటి రెండు వీడియోలు చూసి ఏడ్చానని చెప్పారు. ఈ కేసులో ఎ2 నిందితురాలుగా ఉన్న మహిళ ఏ రకంగా వ్యవహరించిందో ఈ వీడియోల్లో దృశ్యాల్లో ఉన్నాయని ఆమె చెప్పారు.

   పోలీసుల అభినందన

  పోలీసుల అభినందన

  పూర్తి ఆధారాలతో గజల్ శ్రీనివాస్ బండారాన్ని బట్టబయలు చేసినందుకు పోలీసులు తనను అభినందించారని ఆమె చెప్పారు. తనకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని పోలీసులు హమీ ఇచ్చారన బిధితురాలు చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Famous singer Ghazal Srinivas sexual harassments on me from four months said Victim .. A Telugu channel interviewed her on Monday .

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి