వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల్లో అపశృతి... ఒక్కసారిగా కుప్పకూలిన గ్యాలరీ... 200 మందికి గాయాలు...

|
Google Oneindia TeluguNews

సూర్యాపేటలోని పరేడ్ మైదానంలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చొన్న ఒక గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 150-200 మంది గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను హుటాహుటిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాన్వాయ్,పోలీస్ రెవెన్యూ అధికారుల వాహనాలు, 108 అంబులెన్సుల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు సమాచారం.

కెపాసిటీకి మించి...

కెపాసిటీకి మించి...

స్టేడియంలో జాతీయ గీతాలాపన చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులంతా లేచి నిలబడగా గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఏం జరిగిందో తెలిసే లోపే చాలామంది ఇనుప చువ్వల కింద ఇరుక్కుపోయారు. 5 వేల మంది కూర్చొనే సామర్థ్యం ఉన్న గ్యాలరీలో 7 వేలకు మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గ్యాలరీలో ప్రేక్షకులు పరిమిత సంఖ్యకు మించి కూర్చోవద్దని చెప్పినప్పటికీ... జనం ఎక్కువగా రావడంతో వారిని అదుపు చేయలేకపోయినట్లు సమాచారం. ఇనుప చువ్వల్లో కాళ్లు,చేతులు ఇరుక్కుపోవడంతో చాలామందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

తల్లి స్మారాకర్థం మంత్రి ఆధ్వర్యంలో...

తల్లి స్మారాకర్థం మంత్రి ఆధ్వర్యంలో...


మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన తల్లి స్మారకార్థం ఈ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు.దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు.స్టేడియంలో 15వేల కెపాసిటీతో మొత్తం మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. జనం వేలాదిగా తరలిరావడంతో మూడు గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. మరికొద్దిసేపట్లో క్రీడలు ప్రారంభమవుతాయనగా మూడింటిలో ఒక గ్యాలరీ కుప్పకూలింది. కర్రలు,ఇనుప రాడ్లతో ఏర్పాటు చేసిన గ్యాలరీ కావడంతో ఒక్కసారిగా కుప్పకూలడంతో అందరికీ గాయాలయ్యాయి.

భారీ గ్యాలరీలు...

గ్యాలరీల ఏర్పాటుకు 90 టన్నుల ఇనుము,60 టన్నుల కలపను ఉపయోగించినట్లు తెలుస్తోంది. 20 అడుగుల ఎత్తు,240 అడుగుల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేశారు. మొదటిసారి ఒక జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తుండటంతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి భారీగానే ఏర్పాట్లు చేశారు. కానీ ప్రారంభోత్సవంలోనే ఇలా అపశృతి చోటు చేసుకోవడంతో అప్పటిదాకా కోలాహలంగా ఉన్న వాతావరణం కాస్త విషాదంగా మారిపోయింది. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రేక్షకులు సామర్థ్యానికి మించి కూర్చోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులు ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

English summary
At least 100 people were injured after a gallery made of wooden planks collapsed during a Kabaddi match in Telangana's Suryapet area on Mondayevening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X