క్షమాపణ చెప్పిన దిల్ రాజు: అనవసరంగా రాజకీయాల్లోకి లాగకండి

Dil Raju: తెలంగాణ సంస్కృతిని కించపర్చాడంటూ కొంతకాలంలో తీవ్ర విమర్శలు, వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు టాలీవుడ్‌కు చెందిన స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ టీవీ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. సమగ్ర వివరణ ఇచ్చారు. ఓ వీడియోను విడుదల చేశారు.

తెలంగాణలో కల్లు, మటన్‌కే ఎక్కువ వైబ్‌ ఉంటుందని, ఏపీలో ఆ పరిస్థితి ఉండదంటూ ఇటీవలే నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్‌లో దిల్ రాజు బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీని తరువాత ఆయన విమర్శలకు కేంద్ర బిందువు అయ్యారు.

Game Changer Producer Dil Raju apologized and requested not to drag him into politics

దిల్‌ రాజు తెలంగాణ వ్యతిరేకి అని, ఆయన నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులు ఎందుకు ఇచ్చిందంటూ ఇటీవలే బీఆర్ఎస్ శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణలో సినిమాలను విడుదల చేసే హక్కు ఆయనకు లేదంటూ మండిపడ్డారు. కల్లు, మటన్‌ షాపులు పెట్టుకోవాలంటూ ఎదురుదాడికి దిగారు.

దీనిపై దిల్ రాజు స్పందించారు. నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశామని, సాధారణంగా నిజామాబాద్‌లో సినిమా కార్యక్రమాలు జరగవని, గతంలో ఫిదా సక్సెస్ మీట్ మాత్రమే అక్కడ నిర్వహించామని గుర్తుచేశారు. జిల్లావాసిగా నిజామాబాద్‌తో తనకు ఉన్న అనుబంధం అలాంటిదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ సంస్కృతిలో భాగమైన దావత్ గురించి మాట్లాడానని, ఈ సందర్భంగా ప్రజలను అవమానించానని, ఇక్కడి సంప్రదాయాలను హేళన చేశానంటూ కొంతమంది మిత్రులు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే విషయం తన దృష్టికి వచ్చిందని దిల్ రాజు వివరించారు.

తన ఉద్దేశం ఏమిటనేది అదే స్పీచ్‌లో చివరలో చెప్పానని, తెలంగాణ సంస్కృతిని, దావత్‌ను మిస్ అవుతున్నానని అప్పుడే వివరించానన దిల్ రాజు అన్నారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం విడుదల తరువాత దావత్ చేసుకోవాలనుకుంటున్నానని అదే స్పీచ్‌లో చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ కల్చర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దాన్ని అభిమానిస్తానని వివరణ ఇచ్చారు.

అది అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తోన్నారని అన్నారు. ఆ మాట వల్ల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని, తన ఉద్దేశం సంస్కృతిని కించపర్చడం కాదని చెప్పారు. జిల్లావాసిగా భాన్సువాడలో ఫిదా సినిమాను తీశామని, కుటుంబాల మధ్య ఉండే అనుబంధాలకు తెలంగాణ ప్రజలు ఎంత విలువ ఇస్తారనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పామని అన్నారు.

బలగం సినిమా తీసినప్పుడు కూడా తెలంగాణ సమాజం మొత్తం తమను అభినందించిందని దిల్ రాజు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించారని, గుండెలకు హత్తుకున్నారని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని ఇంతగా అభిమానించే తాను హేళన చేస్తానని ఎలా అనుకున్నారో తెలియట్లేదని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నానని, ప్రభుత్వానికి, సినిమా రంగం అభివృద్ధి చెందాలని భావించే యువతకు ఉపయోగపడేలా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన సూచనలకు అనుగుణంగా అక్కడి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోన్నానని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తనను రాజకీయాల్లోకి లాగొద్దని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+