పార్టీ మార్పుపై గండ్ర స్పందన .. మల్లు భట్టీ విక్రమార్క , శ్రీధర్ బాబుతో గండ్ర భేటీ

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ పలు ఉన్నత పదవులు అనుభవించిన భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోటానికి రెడీ అయిపోయారు. పార్టీ మారితే ఆయన సతీమణి గండ్ర జ్యోతికి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై గండ్ర వెంకట రమణా రెడ్డి స్పందించారు .

పార్టీ మార్పు వార్తలను ఖండించిన గండ్ర

పార్టీ మార్పు వార్తలను ఖండించిన గండ్ర

తాను కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అబ్బే అలాంటిదేమీ లేదని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర బాబు గండ్ర వెంకటరమణా రెడ్డితో భేటీ అయిన ఆయన వారితో చర్చలు జరిపారు. ఆయన పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను గండ్ర వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా ఖండించారు.

మల్లు భట్టి విక్రమార్క , శ్రీధర్ బాబులతో గండ్ర భేటీ

మల్లు భట్టి విక్రమార్క , శ్రీధర్ బాబులతో గండ్ర భేటీ

మల్లు భట్టి విక్రమార్క , దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, గండ్ర వెంకట రమణా రెడ్డి ముగ్గురు నాయకులు కాసేపు తాజాగా నెలకొన్న పరిస్థితులపై ,రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. గండ్ర వెంకట రమణా రెడ్డి కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి . టీఆర్ఎస్ లోకి వస్తే గండ్ర వెంకటరమణా రెడ్డి సతీమణికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తామని కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఫిరాయింపు నేతలపై టీపీసీసీ భేటీ .. పార్టీ మార్పు ఖాయమేనా ?

ఫిరాయింపు నేతలపై టీపీసీసీ భేటీ .. పార్టీ మార్పు ఖాయమేనా ?

గండ్రతో పాటు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చాయి.మరి అలాంటిదేమీ లేదని చెప్పిన గండ్ర పార్టీ మారతారా ;లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది . ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అయి పార్టీ ఫిరాయింపులపైన చర్చ జరిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గండ్ర , జగ్గా రెడ్డి , పోడెం వీరయ్యల పార్టీ మార్పుపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+