వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయక చవితి గ్రీటింగ్స్: సిక్స్‌ప్యాక్, హోదా వినాయకుడు, ట్విట్టర్‌లో ఇలా

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయక చవితి అన్ని విఘ్నాలను తొలగించి అందరికీ శుభం కలిగించాలని కోరుకున్నారు.

కాగా, వినాయక చవితిని పురస్కరించుకుని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తజనం చేసుకోవడంతో కాణిపాకం దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ

నగరంలోని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి సోమవారం ఉదయం గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తొలిపూజ చేశారు. రాజ్‌భవన్‌ నుంచి మండపం వద్దకు చేరుకున్న గవర్నర్‌ దంపతులకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నరసింహన్ దంపతులకు శాలువా కప్పి సాదరస్వాగతం పలికారు. అనంతరం సతీమణితో కలిసి నరసింహన్ ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజ చేశారు.

ఇక సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, శ్రియ, దేవిశ్రీ ప్రసాద్‌, ప్రభాస్‌, ప్రకాశ్‌రాజ్‌, వరుణ్‌ సందేశ్‌, కాజల్‌, చార్మి, ప్రణీత, తమన్నా, రాజమౌళి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాజ్‌ తరుణ్‌ తదితరులు సామాజిక మాధ్యమాల్ అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు.

చిరంజీవి, వి.వి. వినాయక్‌, రామ్‌చరణ్‌ కలిసి వినాయకునికి పూజ నిర్వహించిన ఫొటోలను 'ఖైదీ నంబరు 150' చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన అభిమానులతో పాటు దేశ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.

సోమవారం ఉదయాన్నే ఇంటి ఆవరణలో చక్కగా ప్రతిష్టింపజేసిన వినాయకుని విగ్రహం వద్ద ఆసీనుడై పూజలు నిర్వహించారు. వినాయకుని విగ్రహం చుట్టూ రకరకాల పుష్పాలతో, చక్కని లైటింగ్‌తో అలంకరించిన స్వామివారి వద్ద సచిన్ పూజలు చేశారు. ఆ సన్నివేశాన్ని సచిన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

బెజవాడలో 72 అడుగుల డుండీ వినాయకుడు

డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో 72అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా తొలిపూజలు చేశారు. డూండీ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.

ఏలూరులో సిక్స్‌ప్యాక్ గణపతి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తూర్పు వీధిలో బాడీబిల్డర్ రూపంలో ఏర్పాటైన గణపతి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. బెంగాలీ శిల్పులను రప్పించి 42 అడుగుల ఎత్తున్న వినాయకుడిని ఏర్పాటు చేశారు. బాడీబిల్డర్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం నుంచి 21రోజుల పాటు వినాయకుడికి పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

తిరుపతిలో హోదా వినాయకుడు

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంలోని పెద్దలకు సద్భుద్ధి ప్రసాదించాలంటూ తిరుపతిలోని డీఆర్ మహల్‌లో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంటును తలపిస్తూ ప్రత్యేక సెట్ వేసి ప్లకార్డులు చూపినట్లు మండపాన్ని సిద్దం చేశారు. స్పీకర్‌తో సహా అన్ని పార్టీల నేతలను వినాయకుడి రూపంలో చూపించారు. మొత్తం 11 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు.

English summary
Ganesh Chaturthi (also known as Vinayaka Chaturthi or Vinayaka Chavithi) is a festival of the Hindus celebrated in honour of Ganesh the elephant-headed god.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X