ట్యాంక్‌బండ్‌లోనే గణేశ్ నిమజ్జనం: భారీ ఏర్పాట్లు, బండి సంజయ్ వర్సెస్ తలసాని శ్రీనివాస్

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం ఏర్పాటు ఇప్పటి వరకు చేయలేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమజ్జనానికి రెండు రోజులే ఉన్నప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. అయితే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌పై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. దీంతో వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

తూతూ మంత్రంగానే ఏర్పాట్లంటూ బండి సంజయ్

తూతూ మంత్రంగానే ఏర్పాట్లంటూ బండి సంజయ్

హైదరాబాద్​ ట్యాంక్‌బండ్‌​లోనే గణేష్ నిమజ్జనాలు చేద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌లు ఏర్పాట్లు చేస్తుందన్నారు. సచివాలయ సమీపంలోని ఎన్టీఆర్‌ గార్డెన్ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రుల అబద్దాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటి వరకూ తూతూ మంత్రంగానే ఏర్పాట్లు జరుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు.

ఆందోళనలు.. తలసాని ఎంట్రీ

ఆందోళనలు.. తలసాని ఎంట్రీ

బుధవారం ఉదయం గణేశ్‌ నిమజ్జనం విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్‌లో పలుచోట్ల హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ సంయుక్తంగా ఎంజే మార్కెట్‌ కూడలి వద్ద అందోళనకు దిగాయి. ఏటా జరుపుతున్నట్లుగానే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశాయి. కూకట్‌పల్లి వై కూడలి వద్ద భజరంగ్‌దళ్‌, వీహెచ్‌​పీ నాయకులు ఆందోళన చేపట్టారు. వినాయకుని నిమజ్జనానికి కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హుస్సేన్ సాగర్‌​లో గణేశ్‌ నిమజ్జనానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.

గణేశ్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశామంటూ తలసాని శ్రీనివాస్

మరోవైపు, గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున వినాయక చవితి ఏర్పాట్లు చేయలేదన్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నా.. బీజేపీ ఆందోళనలు చేస్తుందని మండిపడ్డారు. కాగా, మంత్రి తలసాని బుధవారం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+