ప్రశాంతంగా నిమజ్జనం: ముంబైలో ఆకట్టుకున్న మంచు గణేష్
హైదరాబాద్: భాగ్యనగరం పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం తెలిపారు. గణనాధుల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు.

కరెంట్ వైర్లు తగిలి ఇద్దరి మృతి
చంపాపేటలో గురువారం వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. రెడ్డి కాలనీ సమీపంలో నిమజ్జనం కోసం వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌లో తరలిస్తున్నారు. ఊరేగింపులో పాల్గొంటున్న ఇద్దరు వ్యక్తులకు కరెంటు వైర్లు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై వారు ప్రాణాలు కోల్పోయారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తులను న్యాయవాది వెంకటేశ్వర్లు, సరూర్‌నగర్ ప్రాంత వాసి సందీప్‌లుగా గుర్తించారు.
ముంబైలో మంచు గణేషుడు
మట్టితో, కూరగాయలతో, గడ్డితో, కొబ్బరికాయలతో, పండ్లతో... ఇలా రకరకాల గణనాథులను చూస్తుంటాం. ఇంకా బాహుబలి గణేషుడు, కబాలి గణేషుడు, గబ్బర్ సింగ్ గణేషులను కూడా చూశాం. మంచు వినాయకుడిని మాత్రం చూడలేదు. ముంబైలోని స్నో వరల్డ్ థీమ్ పార్క్ నిర్వాహకులు ఈ ఆలోచన చేశారు.
అభయ్, సుశాంత్ అనే ఇద్దరు కళాకారులు మంచు వినాయకుడికి ప్రాణం పోశారు. ఇందుకుగాను సుమారు 300 కిలోల మంచుతో 5.5 మీటర్ల ఎత్తులో తయారు చేసిన ఈ గణనాథుడు కరిగిపోకుండా మండపంలో -10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఏర్పాట్లు చేశారు. మంచు గణనాథుడిని తయారు చేసేందుకు 10 నుంచి 15 రోజుల పాటు శ్రమించినట్లు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications