వీడిన గ్యాంగ్ రేప్ మిస్టరీ: ఇస్తామన్న డబ్బులు ఇవ్వనందుకే...
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసును దక్షిణ మండల పోలీసులు ఛేదించారు. బాధితురాలు నిందితులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత డబ్బుల పంపకాల్లో తేడా రావడంతో నిందితులపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నిందితులను అరెస్ట్ చేస్తున్నట్లు దక్షిణ మండల డీసీపీ సత్యనారయణ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

సైదాబాద్‌కు చెందిన షా సమీఉల్లా(40)కు మహ్మద్ అజీంఖాన్ (32), మహ్మద్ షజూర్ (38), అబ్దుల్ ఫహీం (38)తోపాటు దుబాయ్‌లో క్లీనర్‌గా ఉద్యోగం చేసే మహ్మద్ ఫయాజ్ స్నేహితులు. ఫయాజ్ తిరిగి దుబాయ్‌కు వెళ్లిపోతున్న క్రమంలో స్నేహితులు పార్టీ చేసుకుందామని కోరారు. ఈ క్రమంలో అబ్దుల్ ఫహీంకు అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళతో సంప్రదింపులు జరిపారు.
ఆమెను ఓ కారులో కామాటీపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలోకి తీసుకెళ్లి రాత్రి పార్టీ చేసుకున్నారు. మహిళతో ఒప్పందం కుదుర్చుకున్న రూ.పదివేలకు బదులు రూ.ఏడు వేలే ముట్టచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనకు అన్యాయం జరిగిందని గ్రహించిన మహిళ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని గుర్తు తెలియని వ్యక్తులు తనని పంజాగుట్ట ప్రాంతం నుంచి ఎత్తుకువచ్చి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం బయటపడింది. లైంగిక వేధింపులకు గురి చేసినందున నిందితులను అరెస్ట్ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. దుబాయ్ వెళ్లిన ఫయాజ్‌ను సైతం విచారించడానికి ప్రయత్నిస్తున్నామని డీసీపీ వివరించారు.












Click it and Unblock the Notifications