వివాహేతర సంబంధం: రెండోసారి వచ్చి హత్యకు గురయ్యాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

మహబూబ్ నగర్:వివాహేతర సంబంధంతో గంగిరెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం షేక్‌పల్లి ‌లో శనివారం రాత్రి చోటు చేసుకొంది.హత్యకు పాల్పడిన సాదిక్ పోలీసులకు లొంగిపోయాడు.

మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, టెక్కీ నాగరాజు హత్య, కాల్ డేటా పట్టించింది

వివాహేతర సంబంధం కోసం వివాహిత ఎక్కడుందో అడ్రస్ తెలుసుకొని వచ్చి మరీ ప్రాణాలను కోల్పోయాడు. గంగిరెడ్డి నుండి తన కుటుంబాన్ని దూరంగా తీసుకెళ్ళినా కానీ, గంగిరెడ్డి మాత్రం సాదిక్ ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకొని మరీ అక్కడికి వచ్చాడు.

మొదటి భర్త అనుమతితో లవర్‌తో వివాహం: పోలీసులకు ఫిర్యాదు, ఏమైందంటే?

అయితే సాదిక్ భార్య గంగిరెడ్డిని వారించి పంపించింది. అయితే సాదిక్‌ను తొలుత చూసి పారిపోయిన గంగిరెడ్డి రెండో సారి ఇంటికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. గంగిరెడ్డిని హత్య చేసిన సాదిక్ పోలీసులకు లొంగిపోయాడు.

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

ప్రకాశం జిల్లా రామయ్యపాలెంకు చెందిన గంగిరెడ్డి అదే జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన సాదిక్ పాష భార్యతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.ఈ విషయం తెలుసుకొన్న సాదిక్ తన భార్యను తీసుకొని హన్వాడ మండలం షేక్‌పల్లికి వలసవచ్చాడు మిషన్ భగీరథ పనుల్లో మేస్త్రీగా చేరాడు.అక్కడే ఆయన నివాసం ఉంటున్నాడు.

షేక్‌పల్లికి వచ్చిన గంగిరెడ్డి

షేక్‌పల్లికి వచ్చిన గంగిరెడ్డి

గంగిరెడ్డి సాదిక్ భార్యను కలుసుకొనేందుకు హన్వాడ మండలం షేక్ పల్లికి శనివారం రాత్రి చేసుకొన్నాడు. సాదిక్ భార్యతో మాట్లాడుతుండగా సాదిక్ కు మెలకువ వచ్చింది. అయితే అప్పటికే సాదిక్ గంగిరెడ్డిని వెళ్ళిపోవాలని మందలించింది. అయితే సాదిక్ గుర్తించేలోపుగానే గంగిరెడ్డి అక్కడి నుండి పారిపోయాడు.

రెండోసారి వచ్చి హత్యకు గురయ్యాడు

రెండోసారి వచ్చి హత్యకు గురయ్యాడు

సాదిక్ నిద్రలేచిన విషయం గుర్తించిన గంగిరెడ్డి అక్కడి నుండి పారిపోయాడు. అయితే గంగిరెడ్డి కోసం ఆరుబయటే సాదిక్ ఎదురు చూశాడు. ఇంటి వెనుక వైపు నుండి వచ్చిన గంగిరెడ్డి సాదిక్ భార్యతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన సాదిక్ గంగిరెడ్డిపై కత్తితో దాడి చేశాడు.

గొంతు కోసి హత్య చేశాడు

గొంతు కోసి హత్య చేశాడు

తన భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న గంగిరెడ్డిపై తొలుత కత్తితో దాడి చేశాడు. అయితే ఈ సమయంలో అరుస్తున్న గంగిరెడ్డి గొంతు కోశాడు సాదిక్. ఈ ఘటనలో గంగిరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. సాదిక్ పోలీసులకు లొంగిపోయాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gangi Reddy killed for extra marital affair at Shaikpally village in Mahaboobnagar district on Saturday night .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి