కేసీఆర్ దగ్గరివారు టార్గెట్: వీరినే ముక్కలు చేసిన నయీం (పిక్చర్స్)
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ అనంతరం అతని స్థావరాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. మూడు జిల్లాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో లభిస్తున్న ఆయుధాలు చూసి పోలీసులు షాక్ తింటున్నారు.
హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని నయీం, అతని బంధువుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలు, పిస్టళ్లు, తపంచాలు, బుల్లెట్లు లభిస్తున్నాయి. పట్టుబడ్డ డబ్బులను లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.
నయీం సొంతూరు భువనగిరికి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపై పోలీసులు దృష్టి సారించారు. భువనగిరి ఎంపీపీ వెంకటేశ్ ఇంటితో పాటు ఓ జడ్పీటీసీ ఇంటిలోనూ పోలీసులు సోదా నిర్వహించారని తెలుస్తోంది. వారి ఇళ్ల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... నయీంతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
నయీంకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలువడుతున్నాయి. ఓ కథనం ప్రకారం... నయీం ఏకంగా తెరాస అధినేత కేసీఆర్ బంధువులనే టార్గెట్ చేశాడట. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ క్లాస్ 1 కాంట్రాక్టర్ పైన కన్నేసిన నయీం... ఆయన నుంచి రూ.50 కోట్ల మేర వసూలు చేయాలని భావించాడంటున్నారు.

బెల్లి లలిత
భువనగిరి పట్టణానికి చెందిన బెల్లి లలిత ప్రజా గాయకురాలు, తెలంగాణ మలి దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. పీపుల్స్ వార్ సానుభూ తిపరురాలిగా, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన జనసభలో క్రియాశీల కార్యకర్తగా పని చేస్తున్న తరుణంలో పీపుల్స్ వార్‌కు వ్యతిరేకంగా మారిన నయీం ఆమెతో విభేదిచాడు. ఇందులో భాగంగా తమ్ముడు అలీమొద్దీన్, మరో వ్యక్తితో కలిసి 1999 మే 26న బెల్లిల లలితను కిడ్నాప్ చేసి ఆమె శరీర అవయవాలను 18 ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడవేశాడు.

కేఎస్ వ్యాస్
గ్రే హౌండ్స్ బలగాల రూపకర్త ఐపీఎస్ వ్యాస్ హత్యలో నయీం ప్రధాన నిందితుడు. 1993 జనవరి 27న మార్నింగ్ వాక్‌కు వచ్చిన వ్యాస్‌ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపారు. 1995లో నయీంను అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉండగా నయీం కళ్లుగప్పి పారిపోయాడు.

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి
విప్లవ దేశభక్త పులులు వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నయీం ప్రధాన నిందితుడు. 2011 డిసెంబర్ 28న గోవర్ధన్ రెడ్డిని నయీంగ్యాంగ్ హతమార్చింది. రంగారెడ్డి జిల్లాలోని భూవివాదాలు, సెటిల్మెంట్లలో తనకు అడ్డు వస్తున్నాడని చంపేశాడు.

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి
విప్లవ దేశభక్త పులులు వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నయీం ప్రధాన నిందితుడు. 2011 డిసెంబర్ 28న గోవర్ధన్ రెడ్డిని నయీంగ్యాంగ్ హతమార్చింది. రంగారెడ్డి జిల్లాలోని భూవివాదాలు, సెటిల్మెంట్లలో తనకు అడ్డు వస్తున్నాడని చంపేశాడు.

సాంబశివుడు
మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి తెరాసలో చేరిన సాంబశివుడితో తనకు ఎప్పటికైనా ముప్పు ఉందని భావించి, మార్చి 23, 2011న తన అనుచరులతో వలిగొండ మండలం వద్ద దారి కాచి హత్య చేశాడు నయీం. సాంబశివుడు సోదరుడు రాములును కూడా నయీం హత్య చేయించాడు. మే 11, 2014న నల్గొండలో హత్య చేయించాడు.

సాంబశివుడు
మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి తెరాసలో చేరిన సాంబశివుడితో తనకు ఎప్పటికైనా ముప్పు ఉందని భావించి, మార్చి 23, 2011న తన అనుచరులతో వలిగొండ మండలం వద్ద దారి కాచి హత్య చేశాడు నయీం. సాంబశివుడు సోదరుడు రాములును కూడా నయీం హత్య చేయించాడు. మే 11, 2014న నల్గొండలో హత్య చేయించాడు.

నయీం ఎన్‌కౌంటర్
షాద్ నగర్‌లో ఉన్న మిలీనియం టౌన్‌షిప్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ స్థలం నుంచి తప్పించుకున్న నయీం డ్రైవర్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

నయీం ఎన్‌కౌంటర్
పుప్పాలగూడలోని అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీం నివాసంలో శంషాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

నయీం ఎన్‌కౌంటర్
భారీగా నగదు, ఆరు పిస్టోళ్లు, భూములకు సంబంధించిన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. నయీం బంధువుల ఇంటిలో శంషాబాద్ పోలీసులు తనిఖీలు చేశారు.

నయీం ఎన్‌కౌంటర్
నార్సింగి పోలీసులు నయీం భార్యను, బావమరిదిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు విచారిస్తున్నారు.

నయీం ఎన్‌కౌంటర్
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లోని ఓ అపార్టుమెంటులో గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు సోమవారం ఎన్‌కౌంటర్లో హతమార్చిన విషయం తెలిసిందే.
అయితే నయీంతో మాట్లాడేందుకు సదరు కాంట్రాక్టర్ ససేమిరా అన్నారని, దీంతో నేరుగా రంగంలోకి దిగిన నయీం తన మనుషులతో సదరు కాంట్రాక్టర్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి ఆయనను తీవ్ర భయాందోళనలకు గురి చేశాడని అంటున్నారు.
ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ నుంచి మొత్తం విషయం తెలుసుకున్న కేసీఆర్... నయీం ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలను టార్గెట్ చేయకుండా ఉండి ఉంటే మరికొద్ది రోజులు బతికేవాడని అంటున్నారు.
నయీం డ్రైవర్ కోసం ముమ్మరం
షాద్ నగర్‌లో ఉన్న మిలీనియం టౌన్‌షిప్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ స్థలం నుంచి తప్పించుకున్న నయీం డ్రైవర్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పుప్పాలగూడలోని అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీం నివాసంలో శంషాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారీగా నగదు, ఆరు పిస్టోళ్లు, భూములకు సంబంధించిన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. నయీం బంధువుల ఇంటిలో శంషాబాద్ పోలీసులు తనిఖీలు చేశారు. నార్సింగి పోలీసులు నయీం భార్యను, బావమరిదిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
నయీం నివాసంలో సోదాలు పూర్తి: నవీన్ చంద్
పుప్పాలగూడలో నయీం నివాసంలో సోదాలు పూర్తైనట్లు సైబరాబాద్ వెస్ట్ సీపీ నవీన్ చంద్ సోమవారం రాత్రి తెలిపారు. నయీంకు మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయని, సోదాల సందర్భంగా నయీం ఇంట్లో రూ. 2.08 కోట్ల నగదును, 1.93 కిలోల బంగారంను, పలు ఇళ్లకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
పాటు నాలుగు పిస్టళ్లు, ఒక డమ్మీ పిస్టల్, 160 రౌండ్ల బుల్లెట్లు సీజ్ చేశామని, నయీం నివాసంలో మొత్తం 11 మంది ఉంటున్నారన్నారు. నయీం పిల్లలను మంగళవారం చైల్డ్ వెల్ఫేర్ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. పంచనామా పూర్తి అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications