'రేవంత్ హత్యకు నయీం కుట్ర' : నిందను టీఆర్ఎస్ పై తోయడానికేనా?
హైదరాబాద్ : నయీం టార్గెట్ చేసిన హిట్ లిస్టులో రేవంత్ కూడా బాధితుడేనా..? అందుకే తనకు భద్రత పెంచాలంటూ ఏపీ సీఎం చంద్రబాబును సైతం రంగంలోకి దింపారా..? నయీం ఎన్ కౌంటర్ నేపథ్యంలో వినబడుతోన్న ఈ ఊహాగానాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఎక్కువగా మాజీ నక్సలైట్లను.. ఆ నేపథ్యం నుంచి వచ్చిన నేతలనే టార్గెట్ చేసిన నయీం రేవంత్ ను ఎందుకు టార్గెట్ చేశాడన్నది అంతుచిక్కని అంశంగా మారింది. అయితే రేవంత్ హత్యకు నయీం స్కెచ్ వేశాడు కాబట్టే.. రేవంత్ అలర్ట్ అయ్యారన వాదన కూడా బలంగా తెరపైకి వస్తోంది.

గత కొంతకాలంగా హైదరాబాద్-పాలమూరు మధ్యే నయీం గ్యాంగ్ ఎక్కువగా చక్కర్లు కొట్టడం కూడా ఈ వాదనకు మరింత ఊతమిస్తోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, రేవంత్ హత్యకు పక్కా ప్లాన్ ను రూపొందించాలన్న క్రమంలోనే రేవంత్ ఇంటి వద్ద నయీం రెక్కీ కూడా నిర్వహించాడని తెలుస్తోంది.
నిందను కేసీఆర్ సర్కార్ పై మోపడానికే :
రేవంత్ ను చంపి ఆ హత్యా నిందను తెలంగాణ ప్రభుత్వంపై తోసేయడానికే ఈ హత్యకు నయీం ప్లాన్ చేశాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి ఈ హత్యను నయీం ఓ పావులా వాడుకోవడానికి కుట్ర చేశాడన్న చర్చ కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications