గుప్పుమన్న గంజాయి: ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్?, నలుగురి అరెస్ట్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొన్ని ముఠాలు డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నాయి. మెల్లి మెల్లిగా విద్యార్థులకు వాటిని అలవాటు చేసి.. వారి ఎడిక్షన్‌ను భారీగా క్యాష్ చేసుకుంటున్నాయి. ఇదే తరహాలో విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని మంగళ్‌హాట్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

 ఎవరతను?:

ఎవరతను?:

అప్పర్‌ ధూల్‌పేటకు చెందిన సురేందర్‌సింగ్‌(26) కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. గతంలో ఇతనిపై గుడుంబా కేసులు కూడా నమోదయ్యాయి. కొంతమంది ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా కాలేజీ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నాడు.

మాటు వేసి పట్టుకున్నారు..:

మాటు వేసి పట్టుకున్నారు..:

గుడ్డిమల్కాపూర్‌ హీరానగర్‌కు చెందిన జగన్‌ మోరే(26)సురేందర్‌సింగ్‌ వద్ద ఏజెంటుగా పనిచేస్తున్నాడు. ఇటీవలి కాలంలో గంజాయి సరఫరాపై పోలీసులకు ఫిర్యాదులు రావడంతో.. జగన్ మోరే కదలికలపై నిఘా పెట్టారు.

బుధవారం జాలీహనుమాన్‌ వద్ద మరో వ్యక్తి నుంచి గంజాయి ప్యాకెట్లు తీసుకెళ్తున్న సమయంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని టీమ్ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఇంజనీరింగ్ విద్యార్థులకు సరఫరా..:

ఇంజనీరింగ్ విద్యార్థులకు సరఫరా..:


నిందితుడిని అరెస్ట్ చేసిన సమయంలో అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడినుంచి వస్తోంది? అని ప్రశ్నించగా.. సురేందర్ సింగ్ నుంచి ప్రతీ రోజు తనకు ప్యాకెట్లు వస్తున్నట్టు చెప్పాడు.

ఆ ప్యాకెట్లను హైదరాబాద్ మరియు శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు అందజేస్తున్నట్లు వెల్లడించాడు. ప్రధాన నిందితుడైన సురేందర్‌సింగ్‌ కోసం ప్రస్తుతం పోలీసులు వేట మొదలుపెట్టారు.

 గంజాయి, బంగ్..:

గంజాయి, బంగ్..:

మరో ఘటనలో అఫ్జల్‌గంజ్‌లోని మహాలక్ష్మి దాబా వద్ద ఒక బైక్‌లో ఒకటిన్నర కిలోల ఎండు గంజాయితోపాటు బంగ్‌‌ను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాబా వద్ద తనిఖీలు చేసిన అధికారులు.. అక్కడే ఉన్న ఓ బైక్ ను కూడా తనిఖీ చేశారు.

దీంతో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడు లాల్‌బహదూర్‌సింగ్‌తో పాటు రాహుల్‌ అరవింద్‌, బ్రిజ్‌రాజ్‌సింగ్‌లను అరెస్టు చేశారు.మరో నిందితుడు సాగర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On Wednesday, In two different cases four people are arrested for supplying ganja in Hyderabad. Police taken them into custody to know more details.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి