కర్ణాటక ఎపిసోడ్: ఆ ఎమ్మెల్యేలకు బస, పార్క్ హయత్ హోటల్‌లో సౌకర్యాలు

Recommended Video

    హైదరాబాద్ కు ఎమ్మెల్యేలను తరలిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్

    హైదరాబాద్: కర్ణాటకరాష్ట్ర రాజకీయం హైద్రాబాద్ కు చేరుకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత సుబ్బారామిరెడ్డికి చెందిన పార్క్ హయత్ హోటల్‌లో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలకు బస కల్పించాలని భావిస్తున్నారు. మరో వైపు తాజ్ కృష్ణా హోటల్ లో కూడ ఎమ్మెల్యేల బస కోసం కూడ ఏర్పాట్లు చేస్తున్నారు.

    కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు.15 రోజుల్లోపుగా యడ్యూరప్ప బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను రక్షించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలను చేస్తోంది.

    Gayatri hitech group starts Park hayat hotel in hyderabad

    తొలుత రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కేరళలోని రిసార్ట్స్‌కు తరలించాలని భావించారు. కానీ, కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేల క్యాంప్ హైద్రాబాద్ కు మారింది. దేవేగౌడ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో గురువారం నాడు ఫోన్ లో మాట్లాడారని సమాచారం. ఈ తరుణంలో కర్ణాటక ఎమ్మెల్యేల క్యాంప్ హైద్రాబాద్ కు మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    కాంగ్రెస్ , జెడి(ఎస్) ఎమ్మెల్యేల రక్షణకు హైద్రాబాద్ ను ఎంచుకొన్నారు. అయితే హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత టి. సుబ్బరామిరెడ్డికి చెందిన హోటల్ ను ఎంచుకొన్నారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలో ఉన్న పార్క్ హయత్ హోటల్ లో కర్ణాటక ఎమ్మెల్యేలకు బస కల్పించాలని భావించారు.

    సుమారు 32, 256 చ.మీ. ఏరియాలో ఈ హోటల్ నిర్మించారు. 2006లో ఈ హోటల్ నిర్మాణం ప్రారంభమైంది. గాయత్రి హైటెక్ హోటల్స్ సంస్థ ఈ హోటల్ ను నిర్వహిస్తోంది. 2012 ఏప్రిల్ 29వ తేదిన పార్క్ హయత్ హోటల్ ను ప్రారంభించారు. ఈ హోటల్ నిర్మాణానికి సుమారు ఏడు బిలియన్లు ఖర్చు చేసినట్టు సమాచారం.

    ఈ హోటల్ 6 అంతస్థుల్లో నిర్మించారు. 185 రూమ్ లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో 24 సూట్స్ ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్. ఈ హోటల్ లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.

    అత్యాధునికమైన సౌకర్యాలతో ఈ హోటల్ లో ఉన్నాయి. హైద్రాబాద్ లో ప్రముఖులు ఈ హోటల్‌లోనే తమ ఫంక్షన్లు, ఇతర శుభకార్యాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. సినిమా ఫంక్షన్లు కూడ ఈ హోటల్ లో జరుగుతుంటాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుబ్బరామిరెడ్డికి చెందిన పార్క్ హయత్ హోటల్ కావడం వల్ల కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ హోటల్ ను ఎంపిక చేసుకొన్నారని సమాచారం. మరోవైపు తాజ్ కృష్ణ హోటల్‌ ఆప్షన్ ను కూడ ఎంపిక చేసుకొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+