మా తెలంగాణపై జానారెడ్డి ఆగ్రహం
మా తెలంగాణపై జానారెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: నా తెలంగాణ.. ఈ పదం.. ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ లో చేసిన ఈ వ్యాఖ్య ఇపుడు తెలంగాణ అసెంబ్లీ లో దుమారం రేపాయి. మిషన్ భగీరథ పథకం తీరుతెన్నులపై చర్చ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ నా తెలంగాణ ఆడబిడ్డలు నడిబజార్లో బిందె పట్టుకుపోయే దుస్థితి రావొద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి పథకంపై విమర్శలు చేయడం సరికాదు అని అన్నారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేత జానారెడ్డి, మంత్రి ఈటల నా తెలంగాణ అని సంబోధించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నా తెలంగాణ కాదు, మన తెలంగాణ అంటే బాగుంటది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అందరి తెలంగాణ అని, తామిచ్చిన తెలంగాణను నా తెలంగాణ అనడం సరికాదని ఆవేశపూరితంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications