వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకా టూర్: జీఈఎస్ సమ్మిట్‌‌లో 10 దేశాల నుండి మహిళలే, ప్రత్యేకతలివే

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

GES 2017 Hyderabad Specialities : focusing on women Entrepreneurs

హైదరాబాద్:హైద్రాబాద్‌లో జరుగుతున్న జీఈఎస్ (ప్రపంచ పెట్టుబడిదారుల) సదస్సుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పది దేశాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతినిధుల్లో మహిళలు తప్ప, పురుషులు లేరు. మహిళా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకొని ఈ సదస్సును నిర్వహించనున్నారు. అమెరికాలో కాకుండా దక్షిణాసియాలో జరుగుతున్న తొలి సదస్సు హైద్రాబాద్‌దే కావడం విశేషం.

ఇవాంకా టూర్: హైద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ ప్రాంతాల్లో వెళ్తే ఇబ్బందులేఇవాంకా టూర్: హైద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ ప్రాంతాల్లో వెళ్తే ఇబ్బందులే

జీఈఎస్ 2017 సదస్సులో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రతినిధులు హజరౌతున్నారు.ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.

ఇవాంకా టూర్: 1883లోనే టెలిఫోన్, విద్యుత్, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రత్యేకతలివే!ఇవాంకా టూర్: 1883లోనే టెలిఫోన్, విద్యుత్, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రత్యేకతలివే!

మహిళా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకొని నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొనడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు.మరో వైపు ఈ సదస్సుకు హజరౌతున్న ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.

10 దేశాల నుండి మహిళా ప్రతినిధులు

10 దేశాల నుండి మహిళా ప్రతినిధులు

మూడు రోజుల పాటు హైద్రాబాద్‌ నగరం జీఈఎస్ సదస్సుకు అతిథ్యం ఇవ్వనుంది.ఈ సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. అయితే ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రతినిధులు హజరుకానున్నారు. అయితే ఈ సదస్సు ప్రత్యేకంగా మహిళా పారిశ్రామిక వేత్తలపై ఫోకస్ పెట్టింది. దీంతో పది దేశాల నుండి కేవలం మహిళలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ దేశాల నుండి పురుషులు ఈ సదస్సుకు హజరుకావడం లేదు. ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ లాంటి దేశాల నుండి మహిళా ప్రతినిధులే ఈ సదస్సుకు హజరౌతున్నారు.

30 ఏళ్ళలోపు మహిళా పారిశ్రామికవేత్తలు

30 ఏళ్ళలోపు మహిళా పారిశ్రామికవేత్తలు

గతంలో ఎప్పుడూ లేని విధంగా 52.5 శాతం మహిళా ప్రతినిధులే ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అమెరికా నుండి హజరైన ప్రతినిధులకు ఇవాంకా ట్రంప్ సారధ్యం వహిస్తున్నారు. అయితే అమెరికాలోని 38 రాష్ట్రాల నుండి హజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొంటున్న మహిళా పారిశ్రామికవేత్తల్లో 30 ఏళ్ళలోపు వయస్సున్నవారు 5 శాతం ఉంటారని నిర్వాహకులు ప్రకటించారు.ఈ సదస్సులో పాల్గొంటున్నవారిలో 13 ఏళ్ళ వయస్సున్న పారిశ్రామికవేత్త అత్యంత పిన్న వయస్సున్నవారు. కాగా, 84 ఏళ్ళ వయస్సున్న వారు కూడ ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

దక్షిణాసియాలో జీఈఎస్ సదస్సు తొలిసారి

దక్షిణాసియాలో జీఈఎస్ సదస్సు తొలిసారి

2010 నుండి జీఈఎస్ సదస్సులు జరుగుతున్నాయి. అయితే ఎక్కువగా ఈ సదస్సులు అమెరికా దేశంలోనే జరిగాయి. ఇస్తాంబుల్, దుబాయో, నైరోబి,కౌలాలంపూర్‌లలో జరిగాయి. గత ఏడాది సిలికాన్ వ్యాలీలో జరిగింది. దక్షిణాసియాలో తొలిసారిగా హైద్రాబాద్‌లో ఈ సదస్సు జరుగుతోంది.హెచ్‌ఐసీసీలో మూడ్రోజులపాటు జరిగే సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ప్రారంభ వేడుకల్లో వీరితో పాటు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్‌ సహా పలువురు ముఖ్యులు పాల్గొంటారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలపై చర్చ

మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలపై చర్చ

వివిధ దేశాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలపై ప్లీనరీ సెషన్‌ మొదలవుతుంది. సిస్కో చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ మోడరేటర్‌గా వ్యవహరించే ఇందులో... ప్యానెల్‌ స్పీకర్లుగా ఇవాంక, ఎస్సారెస్‌ ఏవియేషన్, పెట్రోలియం ఎండీ శిబొంగ్లే సాంబో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, స్కాండినెవియా బ్యాంక్‌ ఛైర్మన్‌ మార్కస్‌ వ్యాలెన్‌బర్గ్‌ ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఇన్నోవేషన్స్‌ ఆన్‌ వర్క్‌ఫోర్స్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ అనే చర్చా గోష్ఠిలోనూ ఇవాంకా పాల్గొంటారు. ఈ చర్చకు పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. ప్యానెల్‌లో ఇవాంకతో పాటు చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చర్, డెల్‌ సీసీవో కరెన్‌ క్వింటోస్‌ ఉంటారు.

English summary
The city is all set to host the eighth edition of the Global Entrepreneurship Summit (GES), which will be inaugurated by Prime Minster Narendra Modi on Nov 28.Union ministers Sushma Swaraj, Nirmala Sitharaman and Suresh Prabhu will be attending the summit, NITI Aayog CEO Amitabh Kant today told reporters here at a joint press conference with US Ambassador to India Kenneth Juster.More than 10 countries, including Afghanistan, Saudi Arabia and Israel, will be represented by their all-women delegation at the summit, Kant said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X