బెయిల్ ఇవ్వొద్దు, బెదిరిస్తారు: గజల్ శ్రీనివాస్ ఆకృత్యాలెన్నో, మరిన్ని వీడియోలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మహిళను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ బెయిల్‌కు సంబంధించి బుధవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. అంతకుముందు, బెయిల్ ఇవ్వవద్దని పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

  గజల్ శ్రీనివాస్ గదిలో నగ్నంగా : అలాంటివాడు కాదంటూ మరో కోణం ?

  గజల్ శ్రీనివాస్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పోలీసులు తమ కౌంటర్ ఫైల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా పలువురిని విచారించాల్సి ఉందని చెప్పారు. ఆయనకు సమాజంలో పలుకుబడి ఉందని, కేసులో బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేయాల్సి ఉందని చెప్పారు.

  'బెడ్రూంగా ఆ గది, గజల్ శ్రీనివాస్ బాగోతం వీడియోల్లో, ఆడదానితో ఎంజాయ్ కోసం, ఇలా బయటకు'

  కస్టడీ కోరిన పోలీసులు

  కస్టడీ కోరిన పోలీసులు

  గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ వస్తుందా, పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. కేసులో ఏ 1గా గజల్ శ్రీనివాస్ ఉండగా, ఏ 2గా పార్వతి ఉన్నారు. పార్వతిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.

  గజల్ శ్రీనివాస్ నీచుడు, గదిలో నగ్నంగా: బాధితురాలు కన్నీటిపర్యంతం

  పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు పార్వతి

  పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు పార్వతి

  ఈ కేసులో ఏ 2 నిందితురాలు పార్వతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. పోలీసులు ఆమెను విచారించి, ఆ తర్వాత అవసరమైతే అదుపులోకి తీసుకోనున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుంటే ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

  గజల్ శ్రీనివాస్‌కు ఖైదీ నెంబర్ కేటాయింపు

  గజల్ శ్రీనివాస్‌కు ఖైదీ నెంబర్ కేటాయింపు

  చంచల్ గూడ జైలులో ఉన్న గజల్ శ్రీనివాస్‌కు ఖైదీ నెంబర్ 1327ను కేటాయించారు. రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, అభ్యంతరకరమైన ప్రాంతాల్లో మసాజ్ చేయాలని బెదిరించేవాడని బాధిత యువతి చెప్పినట్లుగా రిపోర్టులో ఉంది.

  స్టింగ్ ఆపరేషన్‌తో పట్టిన యువతి

  స్టింగ్ ఆపరేషన్‌తో పట్టిన యువతి

  గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు సంబంధించి చేసిన బాధితురాలు సొంతగా స్టింగ్ ఆపరేషన్ చేసి, వీడియోలు సమకూర్చుకుంది. వీటిని పోలీసులకు అప్పగించింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఇంతస్థాయికి ఎదిగిన గజల్ శ్రీనివాస్ ఇలా ప్రవర్తిస్తారని ఊహించలేదని తెలిసివాళ్లు అంటున్నారు.

  గజల్ శ్రీనివాస్‌కు చెందిన మరో రెండు వీడియోలు

  గజల్ శ్రీనివాస్‌కు చెందిన మరో రెండు వీడియోలు

  మరోవైపు, గజల్ శ్రీనివాస్‌కు సంబంధించిన మరిన్ని వేధింపుల వీడియోలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలు స్వయంగా గజల్ శ్రీనివాస్ అకృత్యాలను స్టింగ్ ఆపరేషన్ ద్వారా వీడియో తీసి బయటపెట్టింది. ఇప్పటికే బెడ్‌పై అభ్యంతరకర స్థితిలో శ్రీనివాస్ పడుకొని ఉండగా ఆ ఫీసులో పనిచేసే పార్వతి అనే యువతి ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

  గజల్ శ్రీనివాస్ నీచుడు, గదిలో నగ్నంగా: బాధితురాలు కన్నీటిపర్యంతం

  పోలీసుల చేతికి 10 వీడియోలు

  పోలీసుల చేతికి 10 వీడియోలు

  బాధితురాలు మొత్తం 10 వీడియోలను పోలీసులకు అందించినట్లుగా తెలుస్తోంది. ఆలయవాణి కార్యాలయాన్ని బ్రోతల్ హౌస్‌గా మార్చిన గజల్ శ్రీనివాస్... పలువురు అమ్మాయిలను అక్కడకు తెచ్చుకున్నట్టు ఈ వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. గంటల కొద్దీ నిడివిగల వీడియోలను బాధితురాలు పోలీసులకు అందించారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆయనపై మరిన్ని సెక్షన్లను జోడించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Singer Kesiraju Srinivas, popularly known as Ghazal Srinivas, was arrested on Tuesday on a charge of sexual harassment levelled against him by a woman radio jockey. The woman approached the cops with video evidence, the police said.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి