GHMC Elections 2020 Exit Poll Results -దుమ్మురేపిన బీజేపీ -టీఆర్ఎస్‌కు టఫ్ -ఎవరికి ఎన్ని సీట్లో తెలుసా?

పేరుకు స్థానికమే అయినా.. సాధారణ ఎన్నికలను తలపించేలా పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగడం.. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి విచ్చేయడం.. కేంద్రంలో నంబర్-2 అమిత్ షా మొదలుకొని.. బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రచారానికి రావడం.. తామేమీ తక్కువ తినలేదంటూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ధీటుగా ప్రచారం చేయడం.. వెరసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఫలితాలు రానే వచ్చాయి.. పోలింగ్ ప్రక్రియ గురువారం సాయంత్రం ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి.

దుమ్మురేపిన బీజేపీ..

దుమ్మురేపిన బీజేపీ..

ఏడాదిన్నర కిందట నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్నప్పటికంటే.. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం తర్వాత బీజేపీలో ఉత్సాహం రెట్టించింది. అదే ఊపుతో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డింది. ఎంఐఎంతో టీఆర్ఎస్ అనుబంధాన్ని ఎడగడుతూ, ముస్లింలే లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. భారీ ఎత్తున ఉచిత పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా పేరుపొందిన ‘ఆరా సర్వే' వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. గత గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్ సీటుకు పరిమితమైన బీజేపీ ఈసారి 28 సీట్లు గెలుచుకోబోతోందని అంచనా వేసింది. అలాగే..

అన్నింటా కమల వికాసం..

అన్నింటా కమల వికాసం..

ఆరా సర్వేతోపాటు సీపీఎస్ సర్వే, పీపుల్స్ సర్వే, ఆత్మసాక్షి సర్వే.. తదితర ఎగ్జిట్ పోల్ ఫలితాల్లోనూ బీజేపీకి తక్కువలో తక్కువ 19 సీట్ల నుంచి గరిష్టంగా 33 సీట్ల వరకు వస్తాయని వెల్లడైంది. గ్రేటర్ లో బీజేపీకి 31.12 శాతం ఓట్లు లభించాయని ఆరా చెప్పగా, 27.9 శాతం ఓట్లు సాధించిందని సీపీఎస్, 32 శాతమని పీపుల్స్ సర్వేలు పేర్కొన్నాయి. మొత్తంగా జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల్లో బిగ్గెస్ట్ గెయినర్ గా బీజేపీ అవతరించడం ఖాయమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. అయితే..

పీఠం మాత్రం టీఆర్ఎస్‌దే..

పీఠం మాత్రం టీఆర్ఎస్‌దే..


బీజేపీకి సీట్ల విషయంలో అటు ఇటుగా ఉన్న సర్వే ఫలితాలు.. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోబోయేది టీఆర్ఎస్ పార్టీనే అని చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు. ఈసారి కూడా బల్దియాపై గులాబీ పీఠమే ఎగరబోవడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, గతంలో 99 సీట్లు పొందిన టీఆర్ఎస్.. ఈసారి 80కి అటు ఇటుగా ఆగిపోనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 40.08 ఓటింగ్ శాతంతో టీఆర్ఎస్ 78(ప్లస్ ఆర్ మైన్ 7) సీట్లు గెలుచుకోనుందని ఆరా సర్వే చెప్పగా.. 82 నుంచి 88 సీట్లు వస్తాయని ఇతర సర్వేలు చెబుతున్నాయి. ఎన్ఎఫ్ఓ సర్వే మాత్రమే టీఆర్ఎస్ కు 95 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఎంఐఎం ఎప్పటిలాగే తన 40 సీట్లను కాపాడుకుంటుండగా, కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా 3 సీట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే..

ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ..

ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ..


ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ లో రీపోలింగ్ ముగియడంతో శుక్రవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. 150 డివిజ‌న్ల‌ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి స‌ర్కిల్ ప‌రిధిలో వార్డుల‌ను బ‌ట్టి 150 హాల్స్, ఒక్కో హాల్ కి 14 టేబుళ్ల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూప‌ర్‌వైజ‌ర్, ఇద్ద‌రు అసిస్టెంట్లు ఉండ‌నున్నారు. మొత్తంగా ఓట్ల లెక్కింపున‌కు 8,152 మంది సిబ్బందిని వినియోగించ‌నున్నారు. బ్యాలెట్ బాక్సు ఓట్ల లెక్కింపు కంటే ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మొత్తం 46.55 శాతం పోలింగ్ న‌మోదైంది. ఎన్నికల కమిషన్ అధికారికంగా వెలువరించే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+