వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పండుగల సీజన్ వచ్చే.!చీరలు తెచ్చె.!బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తీరొక్క రంగుల్లో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసామని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేసారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయించిన 240 పై చిలుకు వివిధ ప్రత్యేక డిజైన్ లతో చీరలు తయారు చేయించి పంపిణీ చేయబోతున్నట్టు పేర్కొన్నారు.

 బతుకమ్మ పండుగ వచ్చింది..

బతుకమ్మ పండుగ వచ్చింది..

ఇందులో భాగంగా ఈనెల 25వ తేదీ నుండి అక్టోబర్ 4 వరకు జరుగు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులకు ప్రభుత్వ యంత్రాంగ అధికారులు పంపిణీ చేయనున్నారు. బీదవారు కూడా ఆనందోత్సవాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలనే ఆశయంతో ఖర్చుకు వెనుకాడకుండా తెలుగింటి ఆడపడుచులకు అందించి వారి కుటుంబం సంతోషంగా పండుగను జరుపుకోవాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ చీరలు పంపిణీ చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రతి కుటుంబానికి పంపిణీ..

ప్రతి కుటుంబానికి పంపిణీ..

ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 30 సర్కిళ్లలోని 150 వార్డుల స్థానిక ప్రజా ప్రతినిధులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా మంత్రులచే ఈ చీరలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కావలసిన చీరలు గోడౌన్ లో నిల్వ చేయడం జరిగిందని, జిహెచ్ఎంసి పరిధిలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాలో జిహెచ్ఎంసి పరిధిలో గల 30 సర్కిళ్లలో ఈ బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.

 మొదట హైదరాబాద్ లో పంపిణీ..

మొదట హైదరాబాద్ లో పంపిణీ..

అంతే కాకుండా హైదరాబాద్ జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేసారు. 624 రేషన్ షాపులలో 8 లక్షల 94 వేల 871 ఆహార భద్రత కార్డులు అందుబాటులో ఉన్నాయన్నారు. 9 లక్షల 2 వేల 84 చీరెల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వ ఉన్నతాదికారులు తెలిపారు. గత సంవత్సరం 5 లక్షల 76 వేల 161 చీరలను పంపిణీ చేసినట్టు అధికారులు స్పష్టం చేసారు.

 హుందాగా వ్యవహరించండి..

హుందాగా వ్యవహరించండి..

అంతే కాకుండా చీరలు నాణ్యత లేవనే కారణంతో ప్రతిపక్ష పార్టీల ప్రోద్బలంతో కొంత మంది మహిళలు తాము తీసుకున్న చీరలను మీడియాకు చూపించడం, బహిరంగంగా కాల్చడం, నేల మీద రుద్దడం వంటి చర్యలు చేయొద్దని, పండుగ సందర్బంగా ప్రభుత్వం వ్యయ ప్రయాసలకోర్చి ఉచితంగా ఇస్తున్న చీరల కార్యక్రమాన్ని కించపరచొద్దని ప్రభుత్వ అధికారులు కొంత మంది మహిళలకు సూచిస్తున్నారు. ప్రభుత్వం తెలంగాణ మహిళల మనోభావాలకు అనుగుణంగానే చీరల పంపిణీ నిర్వహిస్తోందిని, మహిళలు అర్ధం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
The officials of GHMC clarified that they have completed the arrangements for the distribution of Bathukamma sarees in colorful colors like every year with the special initiative of the Chief Minister K. Chandrasekhar Rao for the Bathukamma festival which is a symbol of Telangana state's self-esteem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X