హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్‌కు మొక్క ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ శనివారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

వీరిద్దరు రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కు వారు ఓ మొక్కను అందజేశారు.

ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 150 స్థానాలకు గాను 99 స్థానాల్లో గెలిచింది. అనంతరం రెండు రోజుల క్రితం మేయర్‌గా బొంతు, డిప్యూటీగా బాబా ఎన్నికయ్యారు.

గవర్నర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్

గవర్నర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్

హైదరాబాద్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదేనని మేయర్ బొంతు రామ్మోహన్‌కు గవర్నర్ నరసింహన్ హితవు చెప్పారు.

 గవర్నర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్

గవర్నర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్

జిహెచ్‌ఎంసి మేయర్‌గా ఎన్నికైన బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కు వారు ఒక మొక్కను అందజేశారు.

గవర్నర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్

గవర్నర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్

సంతోషపడిన గవర్నర్ నరసింహన్... హైదరాబాద్ నగరం పచ్చదనంతో కళకళలాడేలా హరితవనంగా మార్చాల్సిన బాధ్యత మీపైనే ఉన్నదన్నారు.

 గవర్నర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్

గవర్నర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్

ఆ దిశగా తాము శక్తివంచన లేకుండా కృషిచేస్తామని గవర్నర్ నరసింహన్‌తో మేయర్, డిప్యూటీ మేయర్ చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు.

English summary
GHMC mayor and Dy Mayor meet Governor Narasimhan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X