నాలాలపై మేయర్ తనిఖీ
హైదరాబాద్: చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర మేయర్ బోంతు రామ్మోహన్ తెలిపారు. సికింద్రాబాద్ బోయిన్ పల్లి హస్మత్‌పేటలోని బోయిన చెరువును జిహెచ్ఎంసి కమీషనర్ జనార్ధన్ రెడ్డి, కూకట్ పల్లి శాసనసబ్యులు మదవరం కృష్ణరావు తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భవంగా మేయర్ మీడియాతో మాట్లాడారు. 67 ఎకరాలల్లో ఉన్న బోయిన చేరువు కబ్జాకు గురై 27 ఎకరాలు మిగిలిందన్నారు. నగరంలో ఉన్న చెరువులన్ని కోంతమేర కబ్జాకు గురైయ్యాయని వాటిని కాపాడాల్సిన బాద్యత అందరి పై ఉందని మేయర్ గుర్తు చేశారు. ప్రభుత్వ భూములను కబ్జాచేసిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని, భూముల కబ్జాకు సంబందించిన సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications