హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో చంద్రబాబు ఇంటికి జిహెచ్ఎంసి పర్మిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ల ఇంటి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందనే ఆరోపణతో గతంలో ఆ ఇంటి నిర్మాణానికి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) కొర్రీలు వేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా జిహెచ్ఎంసి అధికారులు ఆటంకాలు కల్పిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమోదిత లేఔట్ డైమెన్షన్, భవనం ఎత్తు, సెట్ బ్యాక్స్ నిబంధనల్లో అతిక్రమణలు ఉన్నందువల్లనే దరఖాస్తును తిరస్కరించామని అప్పట్లో అధికారులు వివరణ ఇచ్చారు.

GHMC permission granted to Chandrababu's house construction

తాజాగా, వాటిని సవరించీ రివైజ్డ్ ప్లాన్‌ను సమర్పించారు. దీంతో చంద్రబాబు ఇంటికి జిహెచ్ఎంసి అనుమతి ఇచ్చింది. 1893.69 చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాకు ఆమోదం తెలుపుతూ అనుమతి మంజూరు చేశారు. ఇందుకు గాను 6,67,475 ఫీజును జిహెచ్ఎంసికి చెల్లించగా, ఈ నెల 17వ తేదీన అనుమతి మంజూరయింది.

తన ఇంటి నిర్మాణం విషయంలో జిహెచ్ఎంసి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై గతంలో చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

English summary
Greater Hyderabad Municipal Corporation (GHMC) granted permission to Andhra Pradesh CM Nara Chandrababu Naidu's house in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X