హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్లో బిజెపి-టిడిపికి 70 సీట్లు: మోడీ ఇవ్వకుండానే కెసిఆర్ చేశారా? (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి - తెలుగుదేశం పార్టీలు పొత్తును కొనసాగించనున్నాయి. తమ (టిడిపి-బిజెపి) పొత్తుతో 70 స్థానాలకు పైగా కార్పోరేటర్లను గెలుస్తామని, మేయర్ స్థానం కైవసం చేసుకుంటామని ఆ పార్టీల నేతలు గట్టిగా చెబుతున్నారు.

2009 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ 52, తెలుగుదేశం 45, మజ్లిస్ 43, బిజెపి 5, ప్రజారాజ్యం 1 సీటును గెలుచుకుంది. స్వతంత్రులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. ఇప్పుడు తెరాస అధికారంలోకి వచ్చినందున టిడిపి - బిజెపికి పోటీ ఆ పార్టీతోనే అంటున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి 14 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిందని, తెరాస కేవలం రెండు స్థానాల్లోనే గెలిచిందని, దీనిని బట్టే తమకు హైదరాబాదులో ఉన్న పట్టు తెలిసిపోతుందని చెబుతున్నారు. టిడిపి నుంచి గెలిచి తెరాసలోకి వెళ్లిన వారికి ప్రజలు బుద్ధి చెబుతారంటున్నారు.

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

కేంద్రంలో నిధులివ్వకుంటే తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పడకేసేదని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం చురకలేశారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ప్రధాని మోడీ ప్రభుత్వం రూ.3000కోట్లు కేటాయించిందన్నారు.

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

ఇళ్లకు నిధుల కేటాయింపు విషయమై కేసీఆర్‌ తనను కోరగా, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకు వెళ్లానని, దీంతో నిధులు మంజూరయ్యాయని చెప్పారు.

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

మంత్రి కేటీఆర్‌ ఇటీవల బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి సంధించిన ప్రశ్నలకు సమాధానంగా శనివారం రాత్రి హైదరాబాద్‌, గోల్నాక తులసీనగర్‌ లంకలో ఏర్పాటు చేసిన బిజెపి బహిరంగ సభలో దత్తాత్రేయ మాట్లాడారు.

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రం ఇళ్ల నిర్మాణంలో కేంద్ర భాగస్వామ్యం ఉందన్నారు. కిషన్ రెడ్డితో కలిసి కేంద్రంతో మాట్లాడి నగరంలో మూసీనది ప్రక్షాళనకు నిధులు సాధిస్తామన్నారు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కిషన్ రెడ్డి అభివృద్ధి పనులను చేస్తుంటే మధ్యలో కేసీఆర్‌, కేటీఆర్‌ గాలిలో మేడలు కడుతున్నారని ఎద్దేవా చేశారు.

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

ఇళ్లలో పని చేసే కార్మికులకు ఈఎస్‌ఐ వైద్యసేవలను అందిస్తామన్నారు. పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా దత్తాత్రేయ అభివర్ణించారు. కేంద్రంలోని మోడీ సర్కారు దేశరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పదిహేనేళ్ల క్రితం అంబర్‌పేటలో తాను అభివృద్ధి పనులు చేపట్టినపుడు కేటీఆర్‌ అమెరికాలో ఉద్యోగిగా ఉండేవారన్నారు. పేదలకు భాజపా కాపలా కుక్కలా ఉంటుందని, కేసీఆర్‌ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వకుంటే వేటకుక్కల్లా తరిమికొడతామని హెచ్చరించారు.

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

కెటిఆర్‌కు కౌంటర్‌గా బిజెపి సభ

‘మేయర్‌ హమారా... షహర్‌ హమారా' అంటున్న ఎంఐఎం-తెరాసలను తరిమికొట్టాలన్నారు. బిజెపి శాసనసభాపక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్‌ మాట్లాడుతూ... గతంలో రాజీవ్‌ గృహకల్ప, స్వగృహ కింద నిర్మించిన ఖాళీగా ఉన్న 30వేల ఇళ్లను పేద లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

English summary
The Telugudesam and BJP, allies in the 2014 general elections will begin talks over sharing of seats in the forthcoming Greater Hyderabad Municipal Corporation polls in the next few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X