హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరు గెలుస్తారు: టిక్కెట్ల కోసం క్యూ, మజ్లిస్ ఆశావహులు 2వేల పైనే (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆయా పార్టీ కార్యాలయాల ఎదుట ఆశావహులు పెద్ద ఎత్తున వరుస కడుతున్నారు. అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం, మజ్లిస్ పార్టీ కార్యాలయాల ఎదుట టిక్కెట్ ఆశించేవారు వరుస కడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు సమర్పించిన దరఖాస్తుల పైన ఒక ప్రయివేటు సంస్థతో సర్వే చేయించుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను ఆ సంస్థకు అప్పగించారని తెలుస్తోంది.

ఎవరికి ప్రజల్లో పట్టు ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆయా డివిజన్లలో పట్టు ఉన్న వారిని గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో ఇటీవల పార్టీ మారుతున్న ప్రజాప్రతినిధుల అంశం కూడా టిడిపి, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపెడుతోంది.

మజ్లిస్ కార్యాలయం

మజ్లిస్ కార్యాలయం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆయా పార్టీల కార్యాలయాల వద్ద ఆశావహుల సందడి నెలకొంది. మజ్లిస్ తరఫున పాతబస్తీలో పోటీ చేస్తామని రెండు రోజుల్లోనే 2వేలమంది దరఖాస్తు చేసుకున్నారు.

మజ్లిస్ కార్యాలయం

మజ్లిస్ కార్యాలయం

పార్టీ నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించడంతో పాటు ఒక్కొక్కరు రూ.5వేలు డిడి కూడా జత చేశారు. మజ్లిస్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని ప్రవేశ పెట్టారు.

మజ్లిస్ కార్యాలయం

మజ్లిస్ కార్యాలయం

మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో... ఏ డివిజన్లో ఎలాంటి వారు ఆసక్తిగా ఉన్నారో తెలుసుకొని అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మజ్లిస్ నాయకులు ఆలోచిస్తున్నారు.

మజ్లిస్ కార్యాలయం

మజ్లిస్ కార్యాలయం

శనివారం సాయంత్రం వరకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రాథమిక పరిశీలన చేయగా.. 300కు పైగా మహిళ నుంచి దరఖాస్తులు వచ్చాయి.

English summary
Even before approval of reservations for 150 wards in the GHMC by the state government, all major political parties are flooded with applications for tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X