వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గ్రేటర్' పదనిసలు: పిన్నీXకూతురు, ఐఏఎస్ కావాలనుకొని కార్పోరేటర్ బరిలో యువతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ల నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు పడ్డారు. బిజెపి అయితే ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు.

పార్టీలతో పాటు గ్రేటర్ ఎన్నికలలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. వారసులు, చదువుకున్న వారు, చదువుకుంటున్న కొత్తతరం యువత, భార్యాభర్తలు, తండ్రీకొడుకులు గ్రేటర్ బరిలో నిలుస్తున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు కూడా పోటీ పడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.

బరిలో యువ కెరటాలు.. విద్యా కుసుమాలు

- నాడు తండ్రి.. నేడు కూతురు

నగరంలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఎంఎస్ ఈఎన్‌టిగా సేవలందిస్తున్న డాక్టర్ కాత్యాయిని గ్రేటర్ ఎన్నికల్లో అమీర్‌పేట్ డివిజన్ తరపున పోటీకి రంగంలో నిలిచారు. కాత్యాయిని అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి బూర్గుల శ్యాంసుందర్ గౌడ్ కుమార్తె. పుట్టి పెరిగిందంతా అమీర్‌పేట్‌లోనే.

హైస్కూల్ ఎడ్యుకేషన్ అమీర్‌పేట్‌లో జరిగినా ఎంబీబీఎస్ వరకు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో విద్యాభ్యాసం జరిగింది. కాత్యాయిని భర్త సాయిపవన్ మురాఠి ఎంఎస్ ఆర్థోగా ఉన్నారు. అత్త, మామలు కూడా వైద్యులే. ఉన్నత విద్యావంతులైన కుటుంబం నుంచి అమీర్‌పేట్ ఎన్నికల రంగంలో నిలిచిన కాత్యాయినికి రాజకీయాలు కొత్తేంకాదు.

GHMC polls: Students in elections race

తన తండ్రి బూర్గుల 2004లో అప్పటి నగర పాలక సంస్ధలో అమీర్‌పేట్ కార్పొరేటర్‌తోపాటు బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా బీజేపీకి సేవలందించారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు స్పందించి తాను అమీర్‌పేట్ నుంచి రంగంలో నిలిచేందుకు సిద్ధమయ్యాయని కాత్యాయిని చెప్పారు.

- ఐఏఎస్ కావాలనుకొని...

ఐఏఎస్ కావాలనుకున్న ఓ యువతి గ్రేటర్ బరిలో నిలుస్తోంది. ఆగస్ట్‌లో జరిగిన ప్రిలిమ్స్‌లో ఏడు మార్కుల తేడాతో మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో వచ్చే ఏడాది ఎలాగైనా మంచి మార్కులతో సివిల్స్‌కు అర్హత సాధించాలనుకుంటోంది.

అయితే మారిన రాజకీయ సమీకరణాలతో రాత్రికిరాత్రే బిజెపి తరఫున వెంకటేశ్వరకాలనీ నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశించడంతో ఆమె లక్ష్యం మారింది. శ్రీనగర్‌కాలనీలోని ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న బంగారు స్రవంతి గమ్యం ఐఏఎస్ అయితే ఇప్పుడు కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయాల్సి వచ్చింది.

బీజేపీ సీనియర్ నేత బంగారు లక్ష్మణ్ సోదరుడు బంగారు ప్రశాంత్ కుమార్ కుమర్తె స్రవంతి సికింద్రాబాద్‌లోని పీజీ కాలేజీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. కోఠి మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన స్రవంతికి ఐఏఎస్ అధికారిణి కావాలని కల.

అయితే బీజేపీ నేతలు వెంకటేశ్వరకాలనీ టికెట్‌ను చదువుకున్న యువతికి ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున బంగారు ప్రశాంత్ కుమార్తె స్రవంతి పేరు తెరపైకి వచ్చింది.

దీంతో ఆఘమేఘాల మీద వెళ్లి ఇంట్లో నిద్రపోతున్న స్రవంతిని లేపి విషయం తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని అందుకే సివిల్స్‌కు సిద్ధ్దమవుతున్నానని, రాజకీయాల్లో చేరడం ద్వారా కూడా సేవ చేయవచ్చని భావించి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నానని స్రవంతి తెలిపారు.

- బికాం చదువుతున్న ఉప్పల తరుణి బేగంపేట డివిజన్ తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గోల్కొండ డివిజన్ తెరాస అభ్యర్థి అర్షియాఖాన్ ఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతోంది. మచ్చ బొల్లారం డివిజన్ తెరస అభ్యర్థి ఈఎస్ రాజ్ జితేంద్రనాథ్ ఎంబీఏ పూర్తి చేశాడు.

- అల్వాల్ డివిజన్ తెరాస అభ్యర్థి చింతల విజయశాంతి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసింది. కాచిగూడ డివిజన్ నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి జ్యోత్స్న తిరునగరి ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ నుంచి పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి తోకల శ్రీశైలం రెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

ఆర్కే పురం నుంచి పోటీ చేస్తున్న అనితా రెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా ప్రాక్టిస్ చేస్తోంది. ముసారాంబాగ్ నుంచి పోటీ చేస్తున్న తీగల సునరితా రెడ్డి ఎంబీఏ చేశారు. యాకుత్‌పురా డివిజన్ నుంచి పోటీ చేస్తున్న సామ స్వప్న సురేందర్ రెడ్డి బీఏ సైకాలజీ చేశారు. ఇంటర్ నేషనల్ వాలీబాల్ క్రీకారిణి కూడా.

- జియాగూడ డివిజన్ తెరాస అభ్యర్థి బీకాం ఎల్‌ఎల్‌బీ చేశారు. సోమాజిగూడ టీఆర్‌ఎస్ అభ్యర్థి అత్తలూరి విజయలక్ష్మి ఎల్‌ఎల్‌బీ చేశారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ తెరాస అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి బీఎ,ఎల్‌ఎల్‌బీ, డీసీజే పూర్తి చేశారు.

- ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తున్న పిజెఆర్ కూతురు విజయా రెడ్డి ఎంటెక్ , కంప్యూటర్ సైన్స్ (పీహెచ్‌డీ) చేశారు. ఆమె గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. మాదాపుర్ డివిజన్ నుంచి పోటీచేస్తున్న వాలిదాస్ జగదీశ్వర్ గౌడ్ ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.

- చందానగర్ డివిజన్ నుంచి పోటీచేస్తున్న తెరాస అభ్యర్థి బొబ్బ నవతారెడ్డి ఎంఎస్సీ క్లీనికల్ రీసెర్చ్ చదివారు. మీర్ పేట హౌజింగ్‌బోర్డు నుంచి పోటీ చేస్తున్న గొల్లూరి అంజయ్య బీటెక్, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బొంతు రామ్మోహన్ ఎంఏ, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ చేశారు.

బరిలో బంధువులు

- ఎర్రగడ్డ డివిజన్లో గ్రేటర్ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ తోడికోడళ్లు పోటీ పడుతున్నారు. తెరాస అభ్యర్థిగా కంజర్ల అన్నపూర్ణ యాదవ్ బరిలో ఉన్నారు. ఈమే మాజీ కార్పోరేటర్ కంజర్ల సదాశివ యాదవ్ భార్య. టిడిపి నుంచి కంజర్ల జయశ్రీ యాదవ్ బరిలో ఉన్నారు. ఈమె కూడా మాజీ కార్పోరేటర్ కంజర్ల శ్రీనివాస్ యాదవ్ సతీమణి. ఇద్దరు అభ్యర్థులు స్వయానా తోడికోడళ్లు.

- మజ్లిస్ నుంచి షాహిన్ బేగం నామినేషన్ దాఖలు చేశారు. ఈమె మాజీ కార్పోరేటర్ షరీఫ్ భార్య. కాంగ్రెస్ నుంచి మొహసిన్ ఖురేషీ భార్య నౌషిన్ బేగం బరిలో ఉన్నారు. నౌషిన్ బేగంకు షాహిన్ బేగం వరుసకు పిన్ని అవుతుంది. తోడికోడళ్లు, పిన్నీ-కూతుళ్లు బరిలో ఉండటం చర్చనీయాంశమైంది.

- బన్సీలాల్ పేటలో టిడిపి అభ్యర్థిగా చివరి నిమిషంలో వీణా కుమారి పేరును ప్రకటించారు. ఆమె నామినేషన్ వేసేందుకు వెళ్లారు. అభ్యర్థికి కొత్త బ్యాంక్ ఖాతా తప్పనిసరి అని రిటర్నింగ్ అధికారి చెప్పారు. దీంతో తప్పనిసరి కావడంతో ఆమె తండ్రి, టిడిపి నేత రవికుమార్ వెంటనే తన రెండో కూతురు స్రవంతితో నామినేషన్ వేయించారు. నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే భయంతో మూడో కూతురు అర్చనతోను నామినేషన్ వేయించారు.

- గన్ ఫౌండ్రీ డివిజన్ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూతురు శిల్పా గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, మధు గౌడ్ (ముఖేష్ గౌడ్ సోదరుడు) సతీమణి సబితా గౌడ్ బిజెపి నుంచి నామనేషన్ వేశారు. పిన్నీ, కూతురు ఇక్కడ పోటీ పడుతున్నారు.

- భార్యభర్తలు రెండో డివిజన్ల నుంచి బరిలో నిలిచారు. మాదాపూర్ డివిజన్ అభ్యర్థిగా జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట డివిజన్ నుంచి ఆయన సతీమణి పూజిత.. తెరాస అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా ఆయన భావించారన్నారు.

English summary
GHMC polls: Students in elections race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X