కిడ్నాప్ చేసి బాలికపై రేప్: లైంగిక దాడి కేసులో రైల్వే ఎస్పీ
హైదరాబాద్: ఓ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన సాయికుమార్(21)ను సికింద్రాబాదులోని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్ శేఖర్‌గౌడ్ కథనం ప్రకారం.. మౌలాలీ గాయత్రీనగర్‌కు చెందిన సాయికుమార్ అదే ప్రాంతంలో ఉండే ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు.
గత నెల 24వ తేదీన ఆమెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం కుషాయిగూడలో లైంగిక దాడి జరిపాడు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం తీసుకెళ్లి మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం సాయికుమార్ పరారయ్యాడు.

ఈ క్రమంలో బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఉదంతంపై పోలీసులకు వివరించారు. ఈ మేరకు సాయికుమార్‌ను పట్టుకుని రిమాండ్‌కు తరిలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. సాయికుమార్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఇదిలావుంటే, లైంగికదాడికి యత్నించారన్న ఫిర్యాదుతో సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్దన్‌పై కేసు నమోదైంది. హైకోర్టు ఉత్తర్వులతో గురువారం రైల్వే జీఆర్పీ పోలీసులు సెక్షన్ 354, 506 రెడ్‌విత్ 34ల కింద రైల్వే ఎస్పీ జనార్దన్ మీద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగి తనను ఎస్పీ వేధింపులకు గురిచేస్తున్నాడని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications