సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్చేశారు: బాబు పుడితే పాపను ఇచ్చారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మెదక్: ఓ దంపతులకు పండంటి బాబు జన్మించగా.. ఆ శిశువుకు బదులు ఆ దంపతులకు మరో ఆడ శిశువును అప్పగించారు. ఓ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఏడాది తర్వాత వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా సిద్దిపేటలోని నాసర్‌పురకు చెందిన కేశన్నగారి సత్యనారాయణ, నాగరాణి దంపతులు. నారాయణ ఆటో నడుపుతుండగా, నాగరాణి బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. వీరికి తొలిసారి ఆడశిశువు జన్మించింది.

2014 మార్చి 7న మరోసారి ప్రసవం కోసం సిద్దిపేటలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆస్పపత్రి సిబ్బంది ఆడశిశువు జన్మించిందని అప్పగించారు. పెద్దమ్మాయి సనకు వచ్చే ఏడాది కోసం ఇప్పుడే అడ్మిషన్ తీసుకునేందుకు ఇటీవల ఆస్పత్రి ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్ కోసం వెతికారు. అప్పుడు చిన్నపాప పుట్టినప్పుడు ఇచ్చిన పత్రాల్లో మగశిశువు జన్మించినట్లుగా నమోదు చేసి ఉన్నట్లు గుర్తించారు.

శిశువును మార్చారు

శిశువును మార్చారు

ఓ దంపతులకు పండంటి బాబు జన్మించగా.. ఆ శిశువుకు బదులు ఆ దంపతులకు మరో ఆడ శిశువును అప్పగించారు. ఓ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఏడాది తర్వాత వెలుగు చూసింది.

శిశువును మార్చారు

శిశువును మార్చారు

వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా సిద్దిపేటలోని నాసర్‌పురకు చెందిన కేశన్నగారి సత్యనారాయణ, నాగరాణి దంపతులు. నారాయణ ఆటో నడుపుతుండగా, నాగరాణి బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. వీరికి తొలిసారి ఆడశిశువు జన్మించింది.

శిశువును మార్చారు

శిశువును మార్చారు

2014 మార్చి 7న మరోసారి ప్రసవం కోసం సిద్దిపేటలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆస్పపత్రి సిబ్బంది ఆడశిశువు జన్మించిందని అప్పగించారు.

శిశువును మార్చారు

శిశువును మార్చారు

పెద్దమ్మాయి సనకు వచ్చే ఏడాది కోసం ఇప్పుడే అడ్మిషన్ తీసుకునేందుకు ఇటీవల ఆస్పత్రి ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్ కోసం వెతికారు. అప్పుడు చిన్నపాప పుట్టినప్పుడు ఇచ్చిన పత్రాల్లో మగశిశువు జన్మించినట్లుగా నమోదు చేసి ఉన్నట్లు గుర్తించారు.

శిశువును మార్చారు

శిశువును మార్చారు

దీన్ని గమనించిన సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి రికార్డులను, కే షీట్‌ను, మున్సిపాలిటీకి పంపిన రికార్డులను పరిశీలించారు.

దీన్ని గమనించిన సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి రికార్డులను, కే షీట్‌ను, మున్సిపాలిటీకి పంపిన రికార్డులను పరిశీలించారు. ఆ రికార్డుల్లో సైతం మగశిశువుకు జన్మనిచ్చినట్లు నమోదై ఉండడంతో అవాక్కయ్యారు. మాకు ఏ బిడ్డయినా సమానమే కానీ, న్యాయం చేయాలని వైద్యులను దంపతులు నిలదీశారు.

ఈ విషయమై ఆస్పత్రి ఇంఛార్జ్ సూపరింటెండెంట్ కిష్ణారావును ప్రశ్నించగా రికార్డులలో మగశిశువు జన్మించినట్లుగానే ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. డిసిహెచ్‌ఎస్‌కు సమాచారమందించామని, డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి వాస్తవాలను గుర్తించి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

English summary
A girl child given to a couple by hospital staff, instead of a boy child in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X