ఆరాధనపై ఒత్తిడి లేదు
హైదరాబాద్: భాగ్యనగరంలో పదమూడేళ్ల బాలిక ఆరాధన మృతి కలకలం రేపింది. 68 రోజుల పాటు ఉపవాసం చేసిన అనంతరం ఆమె మృతి చెందింది. దీనిపై జైన్ సంఘం స్పందించింది. మూడ నమ్మకాలను తమ సంఘం నమ్మదని చెప్పింది. ఆరాధనను దీక్ష చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని తెలిపింది. వ్యాపారంలో నష్టం వచ్చిందని సికింద్రాబాదుకు చెందిన బంగారు నగర వ్యాపారి ఓ మత గురువు చెప్పిన సలహా విని తన పదమూడేళ్ల కూతురు ఆరాధనతో 68 రోజుల ఉపావాస దీక్ష చేయించారు. ఆమె కేవలం మంచినీళ్లు మాత్రమే తాగేది. ఆమె మృతి నేపథ్యంలో పోలీసు కేసు నమోదయింది.












Click it and Unblock the Notifications