హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షం: బాలిక ప్రాణాలు తీసిన చెట్టు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాదులో చెట్టు ఓ బాలిక ప్రాణం తీసింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు ఓ విద్యార్థిని ప్రాణాలను బలి తీసుకున్నాయి. గాలులకు ఓ చెట్టు కూలి, నడుచుకుంటూ వెళుతున్న బాలికపై పడింది. తీవ్రమైన గాయాలు కావడంతో ఆ బాలిక చనిపోయింది.

బోయినపల్లి మధుపాల ఎన్‌క్లేవ్‌లోని రమేష్‌ ఇంట్లో రాములమ్మ అనే మహిళ పనిచేస్తుంది. భర్త చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో నివసిస్తోంది. రాములమ్మ కూతురు అనూష (12) మడ్‌ ఫోర్టులోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.

గురువారం రాత్రి ఈదురుగాలులకు కాలనీలోని ఓ చెట్టు కూలింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న అనూషపై చెట్టు పడిపోవడంతో తీవ్రగాయాలై మృతిచెందింది. బోయినపల్లి ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ ఆధ్వర్యంలో ఎస్సై సురేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టు కూలి బాలిక మృతి

చెట్టు కూలి బాలిక మృతి

తోటి పిల్లలతో ఆడుతున్న ఓ బాలిక వర్షం పడటంతో ఇంటికివెళుతుండగా చెట్టుకొమ్మ విరిగి మీదపడటంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో గురువారం సాయంత్రం జరిగింది.

చెట్టు కూలి బాలిక మృతి

చెట్టు కూలి బాలిక మృతి

కళ్లముందే ఆడుకున్న ఆ బాలిక అంతలోనే కన్నుమూయడంతో ఆమెతల్లి, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

చెట్టు కూలి బాలిక మృతి

చెట్టు కూలి బాలిక మృతి

రోజులాగే గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి వచ్చిన అనూష సాయంత్రం అదే ఎస్టేట్‌లోని ఫ్లాట్ నంబర్ 10లో నివాసం ఉంటున్న చిన్నమ్మ పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లింది. సాయంత్రం 6:30 గంటల సమయంలో గాలులతో కూడిన వర్షం పడటంతో ఇంటికి వెళ్దామని పరుగున వచ్చింది. అయితే అక్కడ ఉన్న చెట్టు దగ్గరకు రాగానే ఒక్కసారిగా కొమ్మవిరిగి అనూష తలపై పడింది.

చెట్టు కూలి బాలిక మృతి

చెట్టు కూలి బాలిక మృతి

చెట్టు అనూష మీద పడిన సమయంలో కరెంట్ పోవడంతో ఆమెను ఎవరూ గమనించలేదు. వర్షం ఆగిన తర్వాత కరెంట్ రావడంతోప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆమెను గాంధీ అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు.

English summary
A 12 year old girls, Anusha died, as tree collapsed on her at bowenpally in secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X