పెళ్లైనా మాజీ ప్రియుడు లొంగదీసుకున్నాడు, విడిచిపెట్టిన భర్త

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ: తాను అత్తవారి ఇంటికి వెళ్తుండగా, తాను వెళ్తున్న బస్సులో వచ్చి, తనను మధ్యలో దించి, బంధువుల ఇంటికి తీసుకెళ్లి లొంగదీసుకున్నాడని, తనకు అతడితోనే పెళ్లి జరిపించాలని ఓ యువతి తన మాజీ ప్రియుడి పైన ఆందోళనకు దిగిన ఆసక్తికర సంఘటన నల్గొండ జిల్లా దామరచర్లలో చోటు చేసుకుంది.

ప్రేమ పేరుతో తనను ప్రియుడు మోసం చేశాడని చెబుతూ అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. శ్రీను అనే యువకుడు మిర్యాలగూడలోని ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతున్న రోజుల్లో అదే కళాశాలలో చదువుతున్న గౌతమి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.

Girl stages dharna at Lover residence in Nalgonda

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. అబ్బాయి కుటుంబ భ్యులు అధిక కట్నం అడగటంతో పెళ్లి ప్రయత్నాలు మానుకున్నారని తెలుస్తోంది. కొంతకాలం తర్వాత గౌతమికి గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది.

నెల రోజుల క్రితం పుట్టింటి నుంచి అత్త వారింటికి బస్సులో వెళ్తుండగా.. శ్రీను అదే బస్సులో గుంటూరు జిల్లా దాచేపల్లి వరకు తనతో ప్రయాణించి, మార్గమధ్యలోని మంగళగిరిలో బస్సు దించి, బంధువుల ఇంటికి తీసుకెళ్లి లొంగదీసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తన భర్త కూడా తనను విడిచిపెట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. తనను మోసగించిన శ్రీనుతో పెళ్లి జరిపించాలని కోరింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Girl stages dharna at Lover residence in Nalgonda district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X