Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రేమించిన అమ్మాయి కాదన్నదని ఆత్మహత్య..! ఇంతకీ ప్రేమించుకున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా..?

హిమాయత్‌నగర్‌/ హైదరాబాద్‌ : అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని వాళ్ల ఇంట్లో ఒప్పుకోనప్పుడు ఏదైనా అఘాయిత్యం చేసుకున్న సంఘటనలు చూసాం. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇద్దరు అమ్మాయిలు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రెండేళ్లు ఒకే హాస్టల్లో ఉన్నారు. ఏమైందో ఏమో ఇద్దరిలో ఒకరు మరొకరితో 'ఇక నీతో నేను ఉండలేను. నన్ను మర్చిపో' అని తేల్చిచెప్పారు. ఊహించని ఆ సమాధానంతో ఆవేదన చెందిన మరో అమ్మాయి ఆత్మహత్యకు ఒడిగట్టింది. హైదరాబాద్‌ నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

ప్రేమించుకుంది ఆమె అతడు కాదు..! ఆమె ప్లస్ ఆమె.. విచిత్ర ఘటన..!!

ప్రేమించుకుంది ఆమె అతడు కాదు..! ఆమె ప్లస్ ఆమె.. విచిత్ర ఘటన..!!

ఎస్సై వినోద్‌ కుమార్‌ కథనం ప్రకారం.. ఫిలింనగర్‌కు చెందిన యువతి (22), రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మరో యువతి (22) హిమాయత్‌నగర్‌లోని రుషి డిగ్రీ కాలేజీలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. 2016-2018 డిసెంబరు వరకు హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ కాలేజీకి వెళ్లేవారు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ చిగురించింది. ఒకరిని వీడి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకుంది.

 ఐదు నెలల గాఢ ప్రేమ..! కాదనే సరికి మరో యుదతి ఆత్మహత్య..!!

ఐదు నెలల గాఢ ప్రేమ..! కాదనే సరికి మరో యుదతి ఆత్మహత్య..!!

ఐదు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట యువతి హాస్టల్‌ ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్లిపోవడంతో ఇద్దరూ కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ పరీక్షలు మొదలు కావడంతో శనివారం పరీక్ష రాసేందుకు ఎల్లారెడ్డిపేట యువతి హైదరాబాద్‌కు వచ్చింది. హైదర్‌గూడలోని పరీక్ష కేంద్రానికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఫిల్మ్‌నగర్‌ యువతి పరీక్ష ముగిసిన తర్వాత ఆమె వద్దకు వచ్చింది ‘నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు నిన్ను విడిచి ఉండడం నా వల్ల కావడం లేదు. నువ్వు నాతోనే ఉండాలి' అని కోరింది.

 కలిసి తిరిగారు.. సడెన్ గా కాదంది..! మనోవేదనతో ప్రణాలు తీసుకుంది..!!

కలిసి తిరిగారు.. సడెన్ గా కాదంది..! మనోవేదనతో ప్రణాలు తీసుకుంది..!!

తర్వాత ఇద్దరి క్లాస్‌మేట్‌ అయిన మరో యువకుడితో కలిసి నారాయణగూడలోని మెల్కోటే పార్కులో కూర్చుని మాట్లాడుకున్నారు. ‘నీతో నేను ఉండలేను' అని ఎల్లారెడ్డిపేట యువతి చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఫిల్మ్‌నగర్‌ యువతి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. ఆందోళనకు గురైన మిగతా ఇద్దరు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

 చికిత్స పొందుతూ మృతి..! అరుదైన కేసంటున్న పోలీసులు..!!

చికిత్స పొందుతూ మృతి..! అరుదైన కేసంటున్న పోలీసులు..!!

వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆమెను చికిత్స నిమిత్తం కింగ్‌కోఠిలోని ఆస్పత్రికి తరించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదర్‌గూడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+