లైసెన్స్ డ్ గన్ కు పని చెప్పాలా? గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ కు అల్లుడు, వియ్యంకుడు బెదిరింపులు

గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూపు వ్యవస్థాపక చైర్మన్, డైరెక్టర్ డాక్టర్ . కంచర్ల రవీంద్ర నాథ్ తనను అల్లుడు, తన కొడుకు మామ అయిన తన వియ్యంకుడు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మాట వినకుంటే తన దగ్గర ఉన్న లైసెన్స్ ఉన్న గన్ కు పని చెప్పాలా అంటూ బెదిరిస్తున్నారని ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లో నివసించే డాక్టర్ రవీంద్రనాథ్ కు, కుటుంబ సభ్యులకు మధ్య ఆస్తి వ్యవహారాల్లో గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

డాక్టర్ రవీంద్రనాథ్ ఆయన సంపాదించిన ఆస్తి లో దాదాపు 70 శాతానికి పైగా తాను నిర్వహించే గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ కి ఇస్తానని తేల్చి చెప్పడంతో కుటుంబ సభ్యులకు ఆయనకు మధ్య వార్ మొదలైంది. అటు కుమార్తె భర్త సూరజ్ తేజ్ , కొడుకు మామ రాజారావు ఆయనపై ఆస్తి విషయంలో తీవ్ర బెదిరింపులకు దిగుతున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రవీంద్రనాథ్ అల్లుడు పొట్టపల్లి సూరజ్ తేజ్ రవీంద్రనాథ్ ఇంటికి వచ్చి గొడవకు దిగాడు.

Global Hospitals group Chairman complained about son-in-laws threatenings

రవీంద్రనాద్ ఇష్టారాజ్యంగా ఆస్తిని ఫౌండేషన్ కు ఇస్తామంటే ఊరుకునేది లేదని, తాము చెప్పిన విధంగా ఆస్తి పంపకాలు చెయ్యాలని లేదంటే తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ గన్ కు పని చెప్పాల్సి వస్తుంది అంటూ బెదిరింపులకు దిగాడు అని డాక్టర్ రవీంద్రనాథ్ ఫిర్యాదు చేశారని వెల్లడించారు.

అంతేకాదు చెన్నైలో నివసించే తన కుమారుడి మామ కూడా తనను బెదిరిస్తున్నారని, గత కొంత కాలంగా తన అల్లుడు సూరజ్ తేజ్ తో కలిసి తన మొబైల్ ఫోన్ ను హ్యాక్ చేస్తున్నారని, ముఖ్యమైన సంభాషణలను ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్లు వేస్తున్నారని , వాళ్ళతో తనకు ప్రాణహాని ఉందని డాక్టర్ రవీంద్రనాథ్ ఫిర్యాదులో వెల్లడించారు. తనను లేకుండా చేయడం కోసం కిరాయి రౌడీలను కూడా మాట్లాడారు అని ఫిర్యాదులో పేర్కొన్న రవీంద్రనాథ్ మూడు నెలల్లో విషయం తెలుసుకోకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వియ్యంకుడు, అల్లుడు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+