శిక్షలు రద్దు చేయండి: గోకుల్‌చాట్‌ పేలుళ్ల దోషుల అప్పీళ్లను స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌: కింది కోర్టు తమకు మరణ శిక్ష విధిస్తూ వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ హైదరాబాద్‌ లుంబినీ పార్కు, గోకుల్‌చాట్‌ పేలుళ్ల కేసులో దోషులైన అనీక్‌ షఫీక్‌ సయీద్‌, మహమ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి ఉమ్మడి హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.

వీరితోపాటు యావజ్జీవ శిక్షను రద్దు చేయాలంటూ తారిక్‌ అంజుమ్‌ ఎహ్‌సాన్‌ మరో అప్పీలు దాఖలు చేశారు. వీటిపై సోమవారం జస్టిస్‌ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్‌ టి అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Gokul Chat Bomb Blast Case: Convicts file appeals in HC against death sentence

అప్పీళ్లపై విచారణ ముగిసేదాకా బెయిలు మంజూరు చేయాలన్న దోషుల అభ్యర్థనను తిరస్కరించింది. ఇదే కేసులో నిందితులైన షాదిక్‌ ఇష్రార్‌ షేక్‌, ఫరూక్‌ షర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌లను నిర్దోషులుగా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలు చేసిన అప్పీళ్లనూ వీటితో కలిపి విచారిస్తామని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+