షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు ఏపీ, తెలంగాణాలో పసిడి ధరలిలా!

బంగారం ధరలు మళ్లీ దూకుడును కొనసాగిస్తున్నాయి. గత నెలలో లక్ష దాటిన బంగారం ధర, మే నెలలో కాస్త తగ్గుతూ వచ్చింది. బంగారం ధరలు తగ్గుతున్నాయని సామాన్యులు సంతోషపడే లోపే మళ్లీ బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ధరలు రోజు రోజుకి క్రమ క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

నేడు బంగారం ధరలు ఇలా
95 వేల రూపాయల వరకు దిగివచ్చిన బంగారం ధరలు, తాజాగా మళ్లీ నాలుగైదు రోజుల వ్యవధిలోనే 98 వేల మార్కును దాటడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర నేడు 550 రూపాయలు పెరిగి 98,080 వద్ద విక్రయం అవుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరిగి 89 వేల 900 రూపాయల వద్ద కొనసాగుతుంది.

gold rates increased today shock for gold lovers here is the rates in main cities

ఢిల్లీ, ముంబై లలో బంగారం ధరలు ఇలా
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90 వేల 50 రూపాయలుగా కొనసాగుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,230 రూపాయలుగా ప్రస్తుతం విక్రయం అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89 వేల 900 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,080 రూపాయలు.

తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలిలా
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 22క్యారెట్ల బంగారం ధర 89 వేల 900 రూపాయలు కాగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 98,080 రూపాయలుగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాలలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89 వేల 900 రూపాయలు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,080 రూపాయలుగా కొనసాగుతుంది.

బంగారం ధరల షాక్ .. కొనటం కష్టమే
మళ్ళీ బంగారం ధరలు పెరుగుతున్న క్రమంలో సామాన్య , మధ్య తరగతి ప్రజలు నిరాశకు లోనవుతున్నారు. బంగారం ధరలు తగ్గితే కొనుగోలు చేసుకుందాం అని భావించిన వారు ధరలు పెరుగుతున్న క్రమంలో బంగారం ధరలు ఇలా పెరిగితే కొనుగోలు చేయటం కష్టమే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+