వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవిత బంగారు బోనం: అమ్మవారిని దర్శించుకున్న పవన్, ఫ్యాన్స్‌తో పోలీసుల తంటాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

భాగ్యనగరం: లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు ఆదివారం దర్శించుకున్నారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. ఆయనకు ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ దంపతులు అమ్మవారికి పూజలు చేశారు.

ఆయన వెంట మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు, వేకువజామున నాలుగు గంటలకు తలసాని కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఆ తర్వాత ఎంపీ కవిత బంగారు బోనంతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆమె వెంట 1008 మంది భక్తులు బోనాలతో వచ్చారు.

కవిత ఆదయ్యనగర్‌లో బంగారు బోనం ఎత్తుకుని మహంకాళి ఆలయానికి బయలుదేరారు. ఆదయ్య నగర్, సిటీలైట్ హోటల్, ఆర్మీ రోడ్డు, సుభాష్ రోడ్డు మీదుగా వచ్చారు. బంగారం బోనం వద్ద వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మాదేవేందర్ రెడ్డి పూజలు నిర్వహించారు.

బంగారు బోనం ఇలా తయారు చేశారు
అమ్మవారికి భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారంతో ఈ బంగారు బోనాన్ని తయారు చేయించారు. 3 కేజీల 80 గ్రాముల బంగారాన్ని ఈ బోనం తయారీకి ఉపయోగించారు. రెండు బంగారు పాత్రలు, ఒక బంగారు ప్రమిదను బంగారు బోనం కోసం రూపొందించారు. ఈ పాత్రలపై మొత్తం 285 వజ్రాలను అలంకరించారు.

 Golden touch to Mahankali Bonalu: KCR, Pawan, Kavitha visits Mahankali Temple

అమ్మవారిని దర్శించుకున్న పవన్

మహంకాళీ అమ్మవారిని జనసేన అధినేత పవన్ దర్శించుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అభిమానుల్ని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. పవన్ కారు గ్లాస్ ప్రూఫ్ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు చాలామంది ఎగబడ్డారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు చేశారు.

English summary
The two day annual Bonalu festival, celebrated in parts of Telangana as thanks giving to Goddess Mahankali, began today at the famous Ujjaini Mahankali temple in Secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X