మహిళా సంఘాలకు శుభవార్త.. లక్షలు సంపాదించే అవకాశం!
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలోని మహిళలకు విస్తృత అవకాశాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలకు అనేక మార్గాలను చూపిస్తున్నాయి. గతంలో స్వయం ఉపాధి ప్రోత్సాహకాలకే పరిమితం అయితే, ఇప్పుడు మహిళలను వ్యాపారవేత్తలుగా, అత్యంత శక్తివంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బస్సులను నిర్వహించే బాధ్యత మహిళా సంఘాల మహిళలకు అప్పగిస్తే, తాజాగా మరో నిర్ణయం కూడా మహిళలకు సంతోషాన్ని కలిగిస్తోంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలను రాష్ట్రంలో మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి మహిళా గ్రామ సమస్యలను ఎంపిక చేసి సహాయం అందిస్తోంది ప్రభుత్వం.

సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ .. మహిళా సంఘాలకు బాధ్యత
దీనిద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కమ్ లకు విక్రయించి ఆదాయాన్ని పొందవచ్చు. దీనికోసం ఒక్కొక్క గ్రామంలో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. స్థల ఎంపిక బాధ్యత ప్రభుత్వానిదే. కాంట్రాక్టర్ ద్వారా అవసరమైన సామాగ్రిని కూడా అందిస్తారు. ఇక ప్లాంటును ఆయా గ్రామాలలోని మహిళా సంఘాలకు ఇస్తారు.
కోట్ల రూపాయల ఋణం ఇచ్చి సోలార్ ప్లాంట్లు
ఎంపిక చేసిన జిల్లాలలో, ఎంపిక చేసిన గ్రామాలలో మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒక్కొక్క ప్లాంటును నిర్వహించడానికి 2.97 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. అయితే ఇందులో 90% రుణ రూపంలో అందిస్తారు. మిగిలిన 10 శాతాన్ని మహిళా సమాఖ్య పొదుపు నిధుల నుంచి చెల్లించవలసి ఉంటుంది. ఈ రుణాన్ని పదేళ్ల కాలవ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఋణం తీర్చాక 50 లక్షల ఆదాయం
ఈ విధంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన కరెంటుకు ఒక్కొక్క యూనిట్ కు 3.13 రూపాయలు చొప్పున చెల్లిస్తారు. రుణం చెల్లింపు సమయంలో సంవత్సరానికి 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. ఋణం తీరిన తర్వాత 50 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications