వినాయక చవితి వేళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు గుడ్ న్యూస్..!
వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపికబురు ప్రకటించింది. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ప్రమోషన్ ప్రక్రియ పూర్తయిందని సర్కారు స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో వేలాది మంది ఉపాధ్యాయుల కలలు నెరవేరబోతున్నాయి. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
4,454 మందికి పదోన్నతులు..
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 4,454 మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందనున్నారు. వీరిలో కొందరు స్కూల్ అసిస్టెంట్లు హెడ్ మాస్టర్లుగా పదోన్నతి పొందుతారు. మరికొందరు SGTలు హెడ్ మాస్టర్లుగా.. అలాగే ఇంకొంతమంది స్కూల్ అసిస్టెంట్లుగా ఎదగనున్నారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందాన్ని నింపింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు రావడంతో వారు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా వచ్చిన నిజమైన కానుకగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండగా.. ఆయన ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కట్టుబాటుకు నిదర్శనంగా ఉందని అంటున్నారు.
కాగా ఇటీవలి కాలంలో అనేక పాఠశాలల్లో రెగ్యులర్ హెడ్ మాస్టర్లు లేకపోవడం వల్ల పాఠశాలల నిర్వహణ కష్టతరంగా మారింది. ఈ విషయం విద్యార్థుల చదువుపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని.. స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించిపోతాయని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రమోషన్లతో ఉపాధ్యాయుల కెరీర్‌లో పురోగతి సాధించడంతో పాటు రాష్ట్రంలోని విద్యా నాణ్యత మరింత మెరుగుపడనుంది.












Click it and Unblock the Notifications