తెలంగాణ ఉద్యోగార్థులకు శుభవార్త: ఉచిత కోచింగ్ తోపాటు స్టైఫండ్ కూడా, వారికి మాత్రమే
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ఉద్యోగార్థులకు మరో మంచివార్త అందింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న బీసీ అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదే రోజు ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.

21 నుంచి కోచింగ్ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. మొత్తం 16 స్టడీ సర్కిళ్లలో 25 మంది చొప్పున ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. మరో 50 వేల మందికి ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని మంత్రి గంగులా కమలాకర్ తెలిపారు. మొత్తంగా లక్షా 25వేల మందికి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు.
నేటి నుండి బీసీ స్టడీ సర్కిళ్ల కోచింగ్ కోసం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం.సుమారు 1,25,000 మందికి పైగా లబ్దీపొందేలా 50 కోట్లతో కోచింగ్ ప్రక్రియ రూపకల్పన.
— Gangula Kamalakar (@GKamalakarTRS) April 6, 2022
👉 గ్రూప్ 1 అభ్యర్థులకు ఆరు నెల్ల పాటు రూ. 5000 స్టైఫెండ్, గ్రూప్ 2, ఎస్సై అభ్యర్తులకు 3 నెలలు రూ. 2000 స్టైఫెండ్ అందిస్తాం pic.twitter.com/givD6cdDgS
గ్రూప్-1,2 అభ్యర్థులకు స్టైఫండ్
వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తామన్నారు మంత్రి తెలిపారు. గ్రూప్ -1, గ్రూప్-2 కోచింగ్‌కు ఎంపికయ్యే 10 వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తామని ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్థులకు ఆరు నెలల పాటు రూ. 5 వేల చొప్పున, గ్రూప్-2 అభ్యర్థులకు 3 నెలల పాటు నెలకు రూ. 2 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామని మంత్రి కమలాకర్ తెలిపారు.












Click it and Unblock the Notifications