హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్
తాను జన్మించిన సొంత గడ్డపై నిలువెత్తు ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు బాలుడి రూపంలో కొలువుదీరాడు. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా రామభక్తుల కోరిక నెరవేరింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదగా జరిగింది. 23వ తేదీ నుంచే సామాన్య భక్తులకు అయోధ్యలో దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు రాముడిని దర్శించుకునేందుకు భారతీయ రైల్వే నేరుగా రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రతి శుక్రవారం యశ్వంత్ పూర్ - గోరఖ్ పూర్ రైలు నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్లలో స్టాప్స్ ఇచ్చారు. నెంబర్ 15024 రైలు గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి తర్వాతరోజ ఉదయం 10.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. మార్గమధ్యంలో ధర్మవరం, అనంతపూర్, కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్ స్టేషన్లలో ఆగుతుంది.

10.50 గంటలకు తిరిగి కాచిగూడలో బయలుదేరి తర్వాతరోజు సాయంత్రం 4.24 గంటలకు అయోధ్య ధామ్ స్టేషన్ కు చేరుకుంటుంది. స్లీపర్ కు రూ.680, థర్డ్ ఏసీకి రూ.1,810, సెకండ్ ఏసీకి రూ.2,625, ఫస్ట్ ఏసీకి రూ.4,470 ఛార్జీలుగా ఉన్నాయి. మార్చి నెలాఖరు వరకు టికెట్లు అయిపోయాయి. ఏపీలో గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం స్టేషన్ల నుంచి కూడా అయోధ్య ధామ్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇవి ఉత్తరాంధ్ర నుంచి ఒడిసా మీదగా ప్రయాణించి అయోధ్య ధామ్ కు చేరుకుంటాయి.












Click it and Unblock the Notifications