హైదరాబాద్ పై వరాల జల్లు కురిపించిన నరేంద్రమోడీ
లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నవేళ దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్తను వినిపించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు ప్రయాణమవుతున్నవారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ నుంచి ఒడిసాలోని ఖుర్దా రోడ్డు వరకు రెండురోజులపాటు ఇవి నడవనున్నాయి. ఈనెల 10, 11 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు ఇవి బయలుదేరతాయి. వీటి నెంబరు 07129, 07131.
రెండు రాష్ట్రాల్లో పోలింగ్ కోసం
ఇవి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, కొత్తవలస, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపుర్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. 13న ఏపీ, ఒడిశాల్లో పోలింగ్ ఉండటంతో వీటిని ఏర్పాటు చేశారు. 11, 12 తేదీల్లో ఖుర్దారోడ్ స్టేషన్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నెంబర్లు 07130, 07132) రాత్రి 10.00 గంటలకు తిరుగు ప్రయాణమై సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటాయి.

11న తిరుగు ప్రయాణం
సికింద్రాబాద్-నర్సాపూర్ మధ్య ఈ నెల 10న ప్రత్యేక రైలు నెంబర్ 07133 నడవనుంది. శుక్రవారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు మీదుగా నర్సాపూర్ చేరుకుంటుంది. తిరిగి 11వ తేదీన ఇదే మార్గంలో సికింద్రాబాద్ చేరుకుంటుంది.
రైల్వే వ్యవస్థ ఆధునికీకరణ
నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రైల్వే వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజలను తక్కువ ఖర్చుతో సురక్షితమైన ప్రయాణంతో ఎక్కువ దూరం తీసుకువెళ్లేవి ఇవే కాబట్టి మొత్తం రైల్వే వ్యవస్థనే ఆధునికీకరిస్తున్నారు. ఒడిసాలోని బాలాసోర్ దగ్గర జరిగిన ప్రమాదాల్లాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీరిస్తున్నారు.












Click it and Unblock the Notifications