నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన చికెన్ ధరలు, ఏపీ, తెలంగాణాలో ధరలు ఎంతంటే

చాలామంది నాన్ వెజ్ ను తెగ ఇష్టపడుతూ ఉంటారు. వెజిటేరియన్ కూరలు ఎన్ని ఉన్నా, నాన్ వెజ్ లేనిదే తిండి తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది నాన్ వెజ్ లేకుండా అసలే అన్నం తినలేరు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైతే సండే వచ్చిందంటే నాన్ వెజ్ కచ్చితంగా ఉండాల్సిందే.

చికెన్ ప్రియులకు శుభవార్త
ఇక ఆదివారం వచ్చిందంటే చాలు మటన్ షాపులు, చికెన్ షాపులు, చేపల దుకాణాలు కళకళలాడతాయి. ప్రస్తుతం మటన్ దాదాపు వెయ్యి రూపాయల ధర పలుకుతుండగా నిన్న మొన్నటిదాకా చికెన్ కూడా 250 రూపాయల వరకు ధర పలికింది. ఇక తాజాగా కొండెక్కిన కోడి ధరలు కాస్త తగ్గి చికెన్ ప్రియులకు శుభవార్త చెప్పాయి.

Good news for non-veg lovers Chicken prices have decreased what are the prices in AP and Telangana

గతవారం హైదరాబాద్ లో చికెన్ ధరలిలా
ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గతవారం తో పోల్చి చూసుకుంటే ఈ వారం చికెన్ ధరలు బాగానే తగ్గాయి. కిలో చికెన్ మీద 20 రూపాయల నుంచి 35 రూపాయల వరకు ధర తగ్గడం ప్రధానంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో గతవారం కిలో చికెన్ ధర 230 రూపాయల నుండి 250 రూపాయల మధ్య ధర పలకింది.

చాలా చోట్ల తగ్గిన చికెన్ ధరలు
ఈరోజు చాలా ప్రాంతాలలో కిలో చికెన్ ధర 220 నుంచి 200 రూపాయల వరకు విక్రయించడం ప్రధానంగా కనిపించింది. ఇక కొన్ని ప్రాంతాలలో చికెన్ డిమాండ్ ను బట్టి కిలో 230, 240 రూపాయల వరకు కూడా విక్రయించారు. ఇదిలా ఉంటే ఆషాడమాసంలో కోళ్ల ధరలు బాగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఆషాడమాసంలో బోనాల పండుగలు వంటివి నిర్వహించడం, కోళ్లను కోసి అమ్మవార్లకు పూజలు చేయడం వంటివి ఊరూరా చేసే ఆనవాయితీ ఉంది.

ఆషాఢ మాసంలో ధరలు పెరిగే చాన్స్ .. ఇప్పుడైతే పండుగే
ఈసారి ఆషాడమాసంలో భారీగానే చికెన్ ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే ఈసారి చికెన్ ధరలు పెరగడానికి మరొక కారణం కూడా లేకపోలేదు కోళ్ల పెంపకం , వాటి దాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ముందు ముందు చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం తగ్గిన చికెన్ ధరలను ఎంజాయ్ చేయాలని పలువురు సూచిస్తున్నారు. మొత్తంగా చికెన్ ప్రియులకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు నిజంగా పండగలాంటి వార్త అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+