తెలంగాణకు అదిరిపోయే శుభవార్త
మనోహరాబాద్-కొత్తపల్లి వరకు రైల్వే లైన్ పనులు పూర్తి కావొస్తున్నాయి. తెలంగాణలోనిముఖ్యమైన పట్టణాలతో కూడిన ప్రాంతాల ను చుట్టుకుంటూ.. ప్రధానంగా దర్శనీయ యాత్రా స్థలాలను చుట్టేస్తూ ఈ మార్గం సిద్ధమవుతోంది. రైలు కనెక్టివిటీకి ఇది కొత్త శకంలాంటిది అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. వేములవాడ శివయ్యను దర్శించుకోవడానికి వెళ్లేవారితోపాటు సిద్ధిపేట, సిరిసిల్ల చేనేత కార్మికులకు, గజ్వేల్ కు చెందిన వ్యాపార వర్గాలకు ఈ ప్రాజెక్టు ఎంతో ప్రయాణ సౌలభ్యన్ని కల్పించబోతోంది.
రూ.640 కోట్లు ఖర్చు చేశారు : రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం 2508 ఎకరాల భూసేకరణ కోసం రూ.310 కోట్లు, 33 శాతం రాష్ట్ర వాటా కింద రూ.330 కోట్లు కలిపి రూ. 640 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయడంవల్ల సిద్ధిపేటకు రైలుబండి వచ్చింది. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైను పూర్తవడానికి 30 సంవత్సరాలు పట్టింది. మనోహరాబాద్-కొత్తపల్లి పనులు కూడా అనుకన్నంత వేగంగా జరగడంలేదు. పారిశ్రామిక ప్రాంతాలను, సింగరేణి ప్రాంతాలను కలిపే రామగుండం-మణుగూరు కేంద్ర బడ్జెట్ లో కేవలం రూ.10 కోట్లు కేటాయించారు.

తెలంగాణ తర్వాత : ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును 2005లో సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో సిద్దిపేట వరకు వరకు ట్రాక్ పనులు పూర్తయ్యాయి.
త్వరలోనే కరీంనగర్ కు : మనోహరాబాద్ నుంచి సిద్దిపేట, వేములవాడ పుణ్యక్షేత్రం నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 150 కిలోమీటర్ల లైనుకు రూ.1160 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వ్యయాన్ని నిర్ధారించారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు ఐదు దశల్లో 151.40 కిలో మీటర్లు చేపడుతున్న ఈ రైల్వే లైను ట్రాక్ పనులు సిద్దిపేట వరకు పూర్తవడంతో మంత్రి హరీష్ రావు జెండా ఊపి రైలును ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లోనే కరీంనగర్ వరకు ఈ రైలు రానుండటంతో కరీంనగర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు












Click it and Unblock the Notifications