Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ఆర్టీసీకి శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్‌లో గ్రీన్ బస్సులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

పీఎం ఈ డ్రైవ్ పథకానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ కు రెండు వేల బస్సులను అద్దె పద్ధతిలో సరఫరా చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెండు సంస్థలు అర్హతను సాధించాయి. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ల పైన ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో కేంద్రం ఆర్థిక బిడ్ లను తెరిచింది. ఇది కీలక ముందడుగు గా కనిపిస్తుంది.

గ్రేటర్ హైదరాబాద్ కు రెండు వేల ఈవీ బస్సులు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లాట్ వన్ లో ఫ్లోర్ కేటగిరీలో ఒక వెయ్యి 85 బస్సులకు మేఘ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అవకాశం దొరికింది. లాట్ టు స్టాండర్డ్ ఫ్లోర్ విభాగంలో 915 బస్సులు సరఫరాకు గ్రీన్ సెల్ మొబిలిటీ ఎంపికయింది. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం తగ్గింపును ప్రోత్సహించడం కోసం pm ఈ డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది.

good news for telangana rtc green signal for 2000 electric buses in greater hyderabad

దేశవ్యాప్తంగా 10,900విద్యుత్ బస్సులకు టెండర్లు
ఈ పథకంతో 40 లక్షల జనాభా ఉన్న ప్రధాన నగరాలలో వాయు కాలుష్యం తగ్గించే విధంగా గ్రీన్ బస్సులను ప్రోత్సహిస్తోంది. ఢిల్లీ, ముంబై హైదరాబాద్ వంటి నగరాలతో సహా అనేక కీలక నగరాలలో అదే విధానంలో విద్యుత్ బస్సులకు టెండర్లు పిలిచింది. దేశవ్యాప్తంగా 10,900విద్యుత్ బస్సులకు టెండర్లు పిలవగా, కిలోమీటర్ కు కోట్ చేసిన అద్దె తగ్గించాలని కోరుతూ ఎల్ వన్ గా నిలిచిన సంస్థలతో ప్రస్తుతం కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది.

నగరానికి గ్రీన్ బస్సులతో ప్రత్యేక గుర్తింపు
ఈ ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తవుతుందని తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి ఒప్పందం పైన ఆర్టీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం తగ్గించే దిశగా 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అదే విధానంలో పెట్టుకోనున్నారు. ఆర్టీసీకి ఇంధన వ్యయం తగ్గింపుతో పాటు నగరానికి గ్రీన్ బస్సులు ప్రత్యేక గుర్తింపును తెస్తాయి. పాత డీజిల్ బస్సులను దశలవారీగా జిల్లాల రూట్ లకు తరలించాలని ఆర్టీసీ భావిస్తోంది.

పొల్యూషన్ కు చెక్.. పర్యావరణ పరిరక్షణకు దోహదం
ఇక నగరంలో ఈ గ్రీన్ బస్సులు తిరిగితే పొల్యూషన్ తగ్గుతుంది అన్న అభిప్రాయం ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటరీ 2047 ప్రకారం ఆర్టీసీ 2039 నాటికి రాష్ట్రంలోని 9878 బస్సులను 100% ఎలక్ట్రిక్ బస్సులు గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా తాజా ఒప్పందం ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది అన్న అభిప్రాయం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+