తెలంగాణా వాసులకు గుడ్ న్యూస్.. ఆరోజు పార్కుల్లో ప్రవేశం ఉచితం!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 21 రోజులపాటు ప్రతిరోజూ ఒక కార్యక్రమంతో, వివిధ శాఖల వారీగా శాఖాపరమైన ప్రగతిని చూపిస్తూ దశాబ్ధి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ నాటి టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. కెసిఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని తెలియజేయడం కోసం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజులపాటు నిర్వహిస్తున్నారు.

అయితే ఇదే సమయంలో ఈ ఉత్సవాలలో ప్రజలకు కూడా తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఉత్సవాలలో భాగస్వామ్యం తీసుకునేలా, ప్రజలు ఎంజాయ్ చేసేలా అనేక కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఈనెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హరితోత్సవాన్ని నిర్వహించాలని అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఆ రోజున ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు మొక్కలు నాటడానికి అటవీశాఖాధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ హరితహారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖాధికారులు తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలకు పర్యావరణం, పచ్చదనం, చెట్లను కాపాడటం వంటి విషయాలపై అటవీ శాఖ సాధించిన ప్రగతిని చెప్పటంతో పాటు, ప్రజలు కూడా ఎంజాయ్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు.
జూన్ 19వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జూ పార్కులలో సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఆరోజు అటవీశాఖ పనితీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత అటవీశాఖ సాధించిన ప్రగతి ఏంటి? అనేది ప్రజలకు తెలియజేయనున్నారు.












Click it and Unblock the Notifications