365రోజులూ మీకు దీపావళే.. షూరిటీ లేకుండానే రూ.20 లక్షలు!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలను తీసుకువచ్చి వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన పథకం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం. గత పది సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి అండగా ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం వారి ఆర్థిక స్వావలంబనకు బాసటగా నిలుస్తోంది.
50వేల నుంచి 20 లక్షల రూపాయల వరకు రుణాలు
వ్యవసాయేతర పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఈ పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండానే 50వేల నుంచి 20 లక్షల రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. ఇక ఈ పథకంలో మహిళలకు ప్రత్యేకమైన రాయితీలు కూడా ఉండడంతో ఇది నిజంగా మహిళల పాలిట కల్పవృక్షం అని చెప్పవచ్చు. చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారికి కనీస డాక్యుమెంట్లతో ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడం స్కీం యొక్క ప్రధాన ఉద్దేశం.

సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల కోసం ఏర్పాటుచేసిన ఆర్థిక సంస్థ
ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనరీస్ ఏజెన్సీ. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల కోసం ఏర్పాటుచేసిన ఆర్థిక సంస్థ. సహజంగా ఎవరైనా సామాన్య, మధ్యతరగతి ప్రజలు బ్యాంకులలో రుణాలు పొందాలంటే రుణాలకు అనేక నిబంధనలు ఉంటాయి. అలా రుణాలు పొందలేని వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముద్ర లోన్ ఉద్దేశించబడింది.
పది సంవత్సరాలుగా సక్సెస్ రేట్ ను సాధిస్తున్న స్కీమ్
మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడానికి ఈ ముద్ర రుణాలు భూమిక పోషిస్తున్నాయి. గత పది సంవత్సరాలుగా సక్సెస్ రేట్ ను సాధిస్తూ ఈ స్కీమ్ గ్రామీణ ప్రాంతాలలోనూ చాలామందికి చేరువైంది. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంలో లోన్ లను నాలుగు విభాగాలుగా ఇస్తారు. 50 వేల వరకు రుణాలు ఇచ్చే కేటగిరిని శిశు రుణాల కేటగిరి గా చెబుతారు. తోపుడు బండ్లు, కూరగాయల వ్యాపారాలు చేసుకునే వారికి ఈ కేటగిరీలో రుణాలను ఇస్తారు.
కేటగిరీల వారీగా రుణాలు
కిశోర రుణాల కేటగిరిలో 50 వేల నుండి 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అప్పటికే ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, కొత్తగా పెద్ద వ్యాపారాలను పెట్టాలనుకునే వారికోసం ఈ రుణాలను ఇస్తారు. ఈ కేటగిరిలో ఐదు లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు. వీటిని తరుణ్ రుణాలు అంటారు. ఇక తరుణ్ ప్లస్ రుణాలలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలను తీసుకోవచ్చు.
మహిళలకు రాయితీలు, రుణాలపై సబ్సిడీలు
ఎవరైతే తరుణ్ రుణాలను చెల్లిస్తారో వారికి తరుణ్ ప్లస్ రుణాలను ఇస్తారు. ఈ పథకం కింద ఎటువంటి హామీ లేకుండా బ్యాంకు రుణాలు లభిస్తాయి. ఇతర రుణాలతో పోలిస్తే వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు రాయితీలు ఉంటాయి. రుణాల పైన సబ్సిడీలు లభిస్తాయి. 365 రోజులు ప్రభుత్వం అందించే ఈ ముద్ర యోజన పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కండి. ఇంకెందుకు ఆలస్యం ముద్ర లోన్ కోసం అప్లై చేసుకోండి.
-
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications