హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ స్పెషల్ : ఇక ఏటీఎంల్లోనే గోల్డ్ డ్రా - 24*7: ఎలాగంటే..!!

|
Google Oneindia TeluguNews

ఇప్పటి వరకు నగదు ఏటీఎంలు ప్రతీ చోట కనిపిస్తున్నాయి. కానీ, దేశంలోనే తొలి సారిగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఇందుకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. నగదు డ్రా చేసుకున్న విధంగానే బంగారాన్ని డ్రా చేసుకొనేందుకు వీలుగా ఈ ఏటీఎంను ప్రారంభించారు. సాధారణ నగదు ఏటీఎంల తరహాలోనే వీటిని ప్రతీ రోజు 24 గంటల పాటు నిర్వహించనున్నారు. దేశంలోనే హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఈ గోల్డ్ ఏటీఎం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఏటీఎం ద్వారా నాణ్యమైన బంగారం అందుబాటులో ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండనుంది.

దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం

దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం

దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లోని బేగంపేటలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే వినయోగదారుల వద్ద ఉన్న డెబిట్ - క్రెడిట్ కార్డులతో కావాల్సిన బంగారం ఈ ఏటీఎంల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ ఏటీఎం ద్వారా 99.99 శాతం శుద్దత కలిగిన 0.5, 1,2,5,10,20,50,100 గ్రామాలు బంగారు నాణేలు డ్రా చేసుకొనే అవకాశం కల్పించారు. బంగారు నాణేలతో పాటుగా వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలు జారీ అవుతాయి. అదే విధంగా మార్కెట్ ధరకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బంగారం ధరలు కూడా ఏటీఎం స్క్రీన్ పైన కనిపించేలా ఏర్పాట్లు చేసారు. గోల్డ్ సిక్కా కార్యాలయంలో ఈ ఏటీఎంను ఏర్పాటు చేసారు. ఇది ఇప్పుడు నగర ప్రజలకు ప్రత్యేకంగా మారింది.

నగదు తరహాలోనే గోల్డ్ విత్ డ్రా

నగదు తరహాలోనే గోల్డ్ విత్ డ్రా


ఈ తరహా గోల్డ్ ఏటీఎంలను నగరంలోని గుల్జార్ హౌస్, సికింద్రాబాద్, ఆబిడ్స్ తో పాటుగా పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ లో ప్రారంభిందుకు నిర్ణయించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఈ తొలి గోల్డ్ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్యారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతితకు గోల్డ్ ఏటీఎం ఒక నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అంతేకాకుండా గృహిణీలకు తాము దాచుకున్న డబ్బులతో నిర్మొహమాటంగా ఏటీఎం వద్దకు వచ్చి బంగారాన్ని తీసుకోవచ్చని వివరించారు. ఈ ఏటీఎంలో 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు బంగారాన్ని తీసుకునే వెసులుబాటు ఉండడం ప్రత్యేకించి మహిళలకు ఉపయోగపడుతుందన్నారు.

కావాల్సిన పరిమాణంలో.. నాణ్యతతో

కావాల్సిన పరిమాణంలో.. నాణ్యతతో


బంగారు ఏటీఎంలు సాధారణ నగదు ఏటీఎం తరహాలోనే పని చేస్తాయి. ఏటీఎంకి స్వైప్ చేయడానికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. ఆ తర్వాత కొనుగోలుదారు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇచ్చిన ఎంపికను ఎంచుకోవాలి. అప్పుడు కొనుగోలుదారు ధరను ఎంచుకుంటారు. అక్కడే ఎంపిక చేసుకున్న బడ్జెట్ కు అనుగుణంగా అంతే విలువైన బంగారం ఏటీఎం నుంచి క్షణాల్లో అందుతుంది. ఈ ఏటీఎంలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బంగారానికి పెరుగుతున్న అనూహ్య డిమాండ్ తో తక్కువ మొత్తంలోనే నాణ్యమైన గోల్డ్ ఈ ఏటీఎంల ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ ఏటీఎంలకు మహిళలు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతారని అంచనా వేస్తున్నారు.

English summary
Goldsikka introduces its first Gold ATM in Hyderabad and it will be the first real-time gold ATM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X