రేవంత్ సర్కార్ శుభవార్త.. వీడియో పోస్ట్ చేసిన జీహెచ్ఎంసీ!

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ట్రాఫిక్ సమస్యలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగర అవసరాలకు తగినన్ని రోడ్లు లేవు. ఎప్పటికప్పుడు హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించటంపై దృష్టి సారిస్తున్న సర్కార్ తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతుంది.

హైదరాబాద్ లో మరో కొత్త ప్రాజెక్ట్
రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలాగా మరొక కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించనుంది. గ్రేటర్ హైదరాబాద్ లో వాహనదారులకు ఈ ప్రాజెక్టుతో శుభవార్త చెబుతోంది. అతి త్వరలో గ్రేటర్ హైదరాబాద్ లో హెచ్సీఐటిఐ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 826 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలుస్తుంది.

Good news of Revanth govt Video posted by GHMC on HCITI

కేబీఆర్ పార్కు సమీపంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే త్వరలోనే కేబీఆర్ పార్కు సమీపంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో హైదరాబాద్ సిటీ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరం యొక్క రోడ్ నెట్వర్క్ ను మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని, దీనిద్వారా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ట్వీట్ చేసింది.

అభివృద్ధి ప్రణాళిక రెడీ
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు రెండు లైన్ల అండర్ పాస్, పంజాగుట్ట నుండి జూబ్లీహిల్స్ వరకు మూడు లైన్ల అండర్ పాస్ ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు వెల్లడించింది. ఈ నూతన ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుందని చెబుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు యొక్క శంకుస్థాపన జరగనుంది. వర్షాలు వరదలు వచ్చిన సమయంలో ముంపుకు గురికాకుండా వరదలు రానటువంటి మార్గాలను నిర్ధారించే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని జిహెచ్ఎంసి ఒక ట్వీట్ ద్వారా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+