ఏపీ, తెలంగాణను కలిపే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీపై అదిరిపోయే అప్డేట్!

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ పనులలో దూకుడు పెరిగింది. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163 జి మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి ప్రాజెక్టు. ప్రస్తుతం దీనికోసం వరంగల్ జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు మంచిర్యాల నుండి వరంగల్ వరకు నిర్మించబడుతుంది. ఇప్పటికైనా రహదారులను విస్తరించకుండా పూర్తిగా కొత్తగా అభివృద్ధి చేయని భూమిలో నిర్మించబడుతున్న హైవే ఇది.

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల భూసేకరణ పనుల పురోగతి
ఈ ప్రాజెక్టు ప్రధాన మంత్రి గతి శక్తి పథకంలో భాగంగా నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కి సంబంధించి తాజాగా ఒక శుభవార్త వరంగల్ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో నేడు ఏర్పాటు చేసిన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల భూసేకరణ పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కీలక విషయాలు వెల్లడించారు.

Good news Progress in greenfield National Highway 163G works

Take a Poll

మంచిర్యాల్ వరంగల్ ఖమ్మం జిల్లాల ను కలుపుతూ నేషనల్ హైవే
అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డిఆర్వో విజయ లక్ష్మి , ఆర్డిఓ నర్సంపేట ఉమారాణి నేషనల్ హైవే బ్రిడ్జ్ మేనేజర్ తదితరుల తో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో ఈ నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ మంచిర్యాల్ వరంగల్ ఖమ్మం జిల్లాల ను కలుపుతూ నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుందన్నారు.

భూసేకరణ దాదాపు పూర్తి
మొత్తం 176.52 హెక్టార్ల ల్యాండ్ అక్విజేషన్ కు గాను ఇప్పటివరకు 171.34 హెక్టార్ల ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయిందన్నారు.పెండింగ్ అవార్డును నవంబర్ 10 వరకు పూర్తి చేయాలని సంబంధిత ఆర్డీవోలను అధికారులను ఆదేశించారు. 22.02 హెక్టార్ల భూసేకరణ కోర్టు కేసుల తో పెండింగ్లో ఉందని, ఇప్పటివరకు పేమెంట్ అయి అవార్డ్ పాస్ అయిన కేసులలో మ్యుటేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

హన్మకొండ, వరంగల్ జిల్లాలలో భూసేకరణ ఇలా
భూమి కోల్పోయిన రైతుల నష్టపరిహారం త్వరిత గతిన చెల్లించి ల్యాండ్ అక్విజిషన్ త్వరగా పూర్తిచేయాలని అన్నారు. హన్మకొండ జిల్లాలో కూడా భూసేకరణను అధికారులు పూర్తిచేశారు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టులో భాగంగా పరకాల డివిజన్ పరిధిలోని పరకాల, దామెర, శాయంపేట మండలాలకు చెందిన 10 గ్రామాల రైతులకు సంబంధించి భూములను సేకరించి, వారికి కూడా పరిహారాన్ని చెల్లించారు. రెండు జిల్లాల్లోనూ భూసేకరణ పూర్తయితే ఆపై డి పి ఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందిన తర్వాత నిర్మాణ పనులను చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+