హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్, ఆసియాలోనే ఫస్ట్

హైదరాబాద్: రానున్న నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ అంగీకరించినట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం చెప్పారు.

గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకున్న అతిపెద్ద ప్రాంగణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మౌంటెన్ వ్యూలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి గూగుల్‌ సంస్థ ఉపాధ్యక్షుడు డేవిడ్‌ రాడ్‌ క్లిప్‌, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ.వెయ్యికోట్ల పెట్టుబడితో రెండు మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్‌ ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనుంది.

Google plans to open own campus in Hyderabad

ఆసియా ఖండంలోనే మొదటి క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్‌ సంస్థ నాలుగేళ్లలో 13వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

ఎంవోయూ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతదూ.. హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న గూగుల్ సిబ్బందిని 6500 నుంచి 13వేలకు పెంచనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారన్నారు. అలాగే హైదరాబాదులో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేయనుందని, ఇది ఆసియాలోనే ఎతిపెద్ద క్యాంపస్ అవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+