పాతబస్తీలో దారుణం: యువకుడిపై కత్తులతో దాడి(వీడియో)

Recommended Video

    పాతబస్తీలో దారుణం: యువకుడిపై కత్తులతో దాడి(వీడియో) : Cctv Footage Caught On Tape | Oneindia Telugu

    హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడిపై దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నూకర్‌ పార్లర్‌లో 27ఏళ్ల యువకుడు షబ్బీర్‌ హుస్సేన్‌పై కత్తులు, బేస్‌బాల్‌ స్టిక్‌లతో నలుగురు దుండగులు దాడి చేశారు.

    ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ దుండగులు ఒకేసారి కత్తులతో దాడికి పాల్పడ్డారు. సినీఫక్కీలో జరిగిన ఈ దాడిలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. అతడ్ని కాపాడేందుకు ఒకరు ప్రయత్నించగా అతనిపైనా దాడికి యత్నించారు దుండగులు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు.

    తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+