Rajaiah: ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ బుజ్జగింపులు.. పార్టీ మారుతారా లేదా..!
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థును ప్రకటించినప్పటి నుంచి బీఆర్ఎస్ లో అసమ్మతి మొదలైంది. ముఖ్యంగా తనకు టికెట్ ఇవ్వకపోవడంపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మదన పడుతున్నారు. పార్టీ అధిష్టానంపై ఆయన ఆగ్రహాంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. రాజయ్య సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో సమావేశం అయ్యారు. దీంతో రాజయ కాంగ్రెస్ చేరుతారని ప్రచారం జరిగింది.
రాజయ్య పార్టీ మారకుండా ఉండేందుకు బీఆరెఎస్ అధష్టనం బుజ్జగింపులు ప్రారంభించింది. మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే రాజయ్యతో భేటీ అయ్యారు. వినయ్ భాస్కర్ రాజయ్యతో సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడారు. పార్టీ విషయాలు మాట్లాడేందుకే రాజయ్య వద్దకు వచ్చినట్లు చెప్పారు. తమ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. రాజయ్య టికెట్ విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఉద్యకాలంలో రాజయ్య బీఆర్ఎస్ చేరారని.. అప్పటి నుంచి కలిసి పని చేస్తున్నామని చెప్పారు.

పార్టీ అధిష్టానం ఆదేశాలంతో దాస్యం వినయ్ భాస్కర్ రాజయ్యతో భేటీ అయినట్లు తెలుస్తోంది. మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసమే తాను దామోదర రాజనర్సింహను కలిశానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు. దాంట్లో ఎలాంటి రాజకీయ అంశం లేదని లేల్చి చెప్పారు. తాను పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మాదిగలు ఏ పార్టీలో ఉన్నా అందరూ సహకరించాలని సూచించారు. అయితే దాస్యం వినయ్ భాస్కర్ చర్చల తర్వాత రాజయ్య మెత్తబడినట్లు సమాచారం.
ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిని సీనియర్ బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ చేరబోతున్నారు. బీఆర్ఎస్ తుమ్మలకు టికెట్ నిరాకరించడంతో తుమ్మల హస్తం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే రేఖా నాయకు కూడా కాంగ్రెస్ చేరే అవకాశం ఉంది. అటు మంచిర్యాలకు చెందిన చాలా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం వారంతా గాంధీ భవన్ చేరుకుని హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.












Click it and Unblock the Notifications